Demat Account: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారా? ఈ నెల 31లోపు ఇది చేయకపోతే అంతే సంగతులు.. పూర్తి వివరాలు..

డీమ్యాట్ ఖాతాలున్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ ఫారమ్ ను సమర్పించి నామినేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా తప్పనిసరిగా తమ ఎవరో ఒక రిలేటివ్ ను నామినేషన్ పెట్టి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పెట్టుబడి దారులకు ఆదేశిలిచ్చింది.

Demat Account: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారా? ఈ నెల 31లోపు ఇది చేయకపోతే అంతే సంగతులు.. పూర్తి వివరాలు..
Money
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2023 | 8:17 PM

మీకు డీమ్యాట్ ఖాతా ఉందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు నామినేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది లేకుంటే మీ డీమ్యాట్ ఖాతాలు, దానిలో పోర్ట్ ఫోలియోలు అన్నీ స్తంభించిపోతాయి. మీరు పెట్టిన పెట్టుబడులు కూడా రిడీమ్ చేసుకోలేరు. అందుకే డీమ్యాట్ ఖాతాలున్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ ఫారమ్ ను సమర్పించి నామినేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారు కూడా తప్పనిసరిగా తమ ఎవరో ఒక రిలేటివ్ ను నామినేషన్ పెట్టి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పెట్టుబడి దారులకు ఆదేశిలిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆదేశాలివి..

2023 మార్చి 27న, మార్కెట్ రెగ్యులేటర్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. డీమ్యాట్ ఖాతాదారులు ‘నామినేషన్ ఎంపిక’ని పేర్కొనాలి లేదా నామినేషన్‌ను పూర్తిగా తిరస్కరించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైన డీమ్యాట్ ఖాతాలు సెప్టెంబర్ 30, 2023 నుంచిడి సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాయని సెబీ హెచ్చరించింది. మార్చి 16, 2023 నాటి సర్క్యులర్ ద్వారా, లిస్టెడ్ కంపెనీలలో ఫిజికల్ సెక్యూరిటీలను కలిగి ఉన్నవారికి ఇలాంటి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వారు తమ పాన్, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, వారి పోర్ట్ ఫోలియో నంబర్‌లకు సంబంధించిన నమూనా సంతకాన్ని అందించాలని పేర్కొంది. సెబీ సూచించిన దాని ప్రకారం కొత్త పెట్టుబడిదారులు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను తెరిచేటప్పుడు వారి సెక్యూరిటీలను నామినేట్ చేయాలి లేదా అధికారికంగా డిక్లరేషన్ ఫారమ్ ద్వారా నామినేషన్ వద్దని చెప్పాలి. దీని వల్ల పెట్టుబడిదారులకు వారి ఆస్తులను భద్రపరచడానికి, వారి చట్టపరమైన వారసులకు వాటిని బదిలీ చేయడానికి సహాయపడుతుంది.

గడువులోపు చేయకపోతే..

ఉమ్మడిగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలతో సహా ఇప్పటికే ఉన్నపెట్టుబడిదారులకు, ఈ గడువులోపు మీరు నామినేషన్ ఏర్పాటు చేయకపోతే వాటి నుంచి డెబిట్ కు అవకాశం ఉండదు. అలాగే పెట్టుబడి దారుల డీమ్యాట్ ఖాతాలు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు స్తంభించిపోతాయి. వారు నామినేట్ చేసే వరకు లేదా నామినేషన్ వద్దని ప్రకటించే వరకు వాటిని యాక్సెస్ చేయలేరు.

ఇవి కూడా చదవండి

గడువు పొడిగిస్తూ వస్తోంది..

మొదట 2021 జూలైలో ఇప్పటికే ఉన్న అర్హులైన ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులందరినీ 2022, మార్చి 31 లేదా అంతకు ముందే నామినేషన్ దాఖలు చేయాలని సెబీ కోరింది. లేని పక్షంలో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు డెబిట్‌ల కోసం స్తంభించిపోతాయని చెప్పింది. మ్యూచువల్ ఫండ్ యూనిట్‌హోల్డర్లకు సంబంధించి 2022 జూన్ 15న రెగ్యులేటర్ తన సర్క్యులర్‌లో, 2022, ఆగస్టు ఒకటి లోపు మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రైబర్‌లు నామినేషన్ వివరాలను సమర్పించడం లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి డిక్లరేషన్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. తర్వాత, గడువు అనేక సందర్భాల్లో పొడిగిస్తూ వస్తోంది. మార్కెట్ పార్టిసిపెంట్ల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాల ఆధారంగా, ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేసే నిబంధన 2023, డిసెంబర్ 31 నుండి అమల్లోకి వస్తుందని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఏదైనా జరిగితే ఆ ఆస్తులను ఎవరికి బదలాయించాలో ఎవరికీ నామినేట్ చేయకుండానే గతంలో చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఖాతాలు తెరిచారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!