Property: ఆస్తిని కొనేటప్పుడు ఈ రెండూ గుర్తుపెట్టుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు!
ఆస్థిని కొనుగోలు చేయడం కొన్నిసార్లు సవాళ్లతో కూడుకున్న పని. ప్రత్యేకించి మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన చిక్కులు తెలియనప్పుడు. ప్రాపర్టీని. ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలా అంశాలు గుర్తుంచుకోవాలి. వీటిలో ఒకటి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగి ఉండడం. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. అవి.. ఫ్రీహోల్డ్, లీజు హోల్డ్ ప్రాపర్టీలు. ఈ రెండూ ప్రాపర్టీ ఓనర్ షిప్ లో భాగమే. ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలో, యాజమాన్య హక్కులు
ఆస్థిని కొనుగోలు చేయడం కొన్నిసార్లు సవాళ్లతో కూడుకున్న పని. ప్రత్యేకించి మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన చిక్కులు తెలియనప్పుడు. ప్రాపర్టీని. ముఖ్యంగా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలా అంశాలు గుర్తుంచుకోవాలి. వీటిలో ఒకటి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగి ఉండడం. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి. అవి.. ఫ్రీహోల్డ్, లీజు హోల్డ్ ప్రాపర్టీలు. ఈ రెండూ ప్రాపర్టీ ఓనర్ షిప్ లో భాగమే. ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలో, యాజమాన్య హక్కులు ఎప్పుడూ మీవద్దే.. అంటే కొనుగోలుదారు వద్దే ఉంటాయి. మీ తర్వాత ఈ హక్కులు మీ చట్టబద్దమైన వారసులకు బదిలీ అవుతాయి. ఆస్తి విక్రయించే వరకు, మీరు, మీ కుటుంబ సభ్యులు దానిని ఉపయోగించడానికి, అదనపు నిర్మాణాన్ని చేపట్టడానికి, ఆ ఆస్తిని అమ్మడానికి అన్ని హక్కులను కలిగి ఉంటారు. భూమి ఇంకా ఏదైనా నిర్మాణం.. ఈ రెండూ ఇందులో భాగమే. అందుకే దేశంలో ఎక్కువ ఆస్తులు.. ఫ్రీహోల్డ్‌గానే ఉన్నాయి.
ఇక, లీజ్‌హోల్డ్ ఆస్తిపై కొనుగోలుదారుడికి యాజమాన్య హక్కులు ఉంటాయి. కానీ అవి కొంత పరిమిత కాలానికే ఉంటాయి. ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ దీనికి సంబంధించిన కార్యక్రమాలను చూస్తుంది. ఉదాహరణకు, నోయిడా వంటి ప్రదేశాలలో, ప్రభుత్వం రైతుల నుండి భూమిని సేకరించి, బిల్డర్లకు లీజుకు ఇస్తుంది. ఆపై వారు కొనుగోలుదారులకు ఫ్లాట్లను నిర్మించి విక్రయిస్తారు. కానీ లీజు వ్యవధి ముగిసిన తర్వాత, వాటి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే తిరిగి వస్తాయి.
ఇటువంటి ప్రాపర్టీల లీజు వ్యవధి 30 నుంచి 99 సంవత్సరాల వరకు ఉండొచ్చు. గడువు ముగిసిన తర్వాత, ప్రభుత్వం లీజును పొడిగించడం లేదా ఫ్రీహోల్డ్‌గా మార్చడం.. ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలు లీజు హోల్డ్ ప్రాపర్టీలుగా ఉన్నాయి. ఢిల్లీలో, లీజుహోల్డ్, ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలు రెండూ ఉన్నాయి, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఆస్తులను లీజుహోల్డ్ నుండి ఫ్రీహోల్డ్‌గా కొన్ని సందర్భాల్లో మారుస్తుంది.
ఫ్రీహోల్డ్, లీజు హోల్డ్ ప్రాపర్టీస్ వల్ల ప్రయోజనాలూ ఉన్నాయి. సమస్యలూ ఉన్నాయి. ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలను చూస్తే.. యజమాని వాటిపై పూర్తి యాజమాన్య హక్కులను కలిగి ఉంటాడు. ఆ ఆస్తికి సంబంధించి ఏవైనా మార్పులు చేసుకోవచ్చు. ఈ ఆస్తిపై యజమానికి పూర్తి హక్కులు ఉంటాయి. అందుకే ఎలాంటి సమస్యా లేకుండా ఆస్తిని అమ్ముకోవ్చచు. అదే , లీజుకు తీసుకున్న ఆస్తి అయితే.. దానిపై యజమానులకు లీజు వ్యవధి వరకు మాత్రమే హక్కులు ఉంటాయి. ఒకవేళ వారు ఆస్తిలో మార్పులు చేయాలనుకున్నా.. అమ్మాలనుకున్నా.. అధికారుల నుంచి NOC తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ట్రాన్స్ ఫర్ ఛార్జీలను కూడా చెల్లించాల్సి రావచ్చు.
కొన్ని సందర్భాల్లో, లీజు హోల్డ్ ప్రాపర్టీలతో పోలిస్తే ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలకు హోమ్ లోన్‌ల వడ్డీ రేట్లు తక్కువగా ఉండొచ్చు. కొనుగోలుదారుకు పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నందున బ్యాంకులు కూడా ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలను తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడిగా పరిగణిస్తాయి. దీంతోపాటు ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలకు అధిక రుణ మొత్తాలను ఇస్తాయి.
ఫ్రీహోల్డ్ ప్రాపర్టీలతో పోలిస్తే లీజు హోల్డ్ ప్రాపర్టీలు చౌకగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ ఆస్తిని శాశ్వతంగా కొనుగోలు చేయరు. నిర్దిష్ట కాలానికి మాత్రమే దానిని కొంటారు. లీజుహోల్డ్ ఆస్తిని తీసుకోవడం వల్లే వచ్చే సమస్య ఏమిటంటే.. లీజును పునరుద్ధరించేటప్పుడు… లేదా దానిని ఫ్రీహోల్డ్ ఆస్తికి మార్చడానికి అనుమతిని తెచ్చుకోవాలంటే.. దానికి సంబంధించిన ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ప్రాపర్టీ అప్రిసియేషన్ ను చూస్తే.. ఫ్రీహెల్డ్ ప్రాపర్టీలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే వీటి ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. అదే ఫ్రీహోల్డ్ ప్రాపర్టీ రీసేల్ విలువను చూస్తే.. ఇది కూడా బాగుంటుంది. లీజు హోల్డ్ ప్రాపర్టీల విషయానికొస్తే, ప్రాపర్టీ విలువ ప్రారంభంలో బాగానే ఉంటుంది… కానీ లీజు గడువు ముగుస్తున్న కొద్దీ… ప్రాపర్టీ ధరలు తగ్గడం మొదలవుతుంది. మీరు తరతరాలుగా మీ కుటుంబంతో కలిసి ఒకే ఇంటిలో ఉండాలనుకుంటే.. కాస్త ఖరీదైనా.. ఫ్రీహోల్డ్ ప్రాపర్టీని కొనుగోలు చేయాలి. మీరు ఏ ప్రాపర్టీని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే ముందు, మీ బడ్జెట్, ఆస్తి ఉన్నప్రాంతం , ప్రజా రవాణా సౌకర్యాలు వంటి ఇతర ప్రాథమిక అంశాలను పరిగణినలోకి తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి