Lectric E-City: మోపెడ్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇంటి అవసరాలకు బెస్ట్.. అనువైన ధరలో, సాలిడ్ డిజైన్‌తో..
లెక్ట్రిక్స్ స్టార్టప్ మన దేశంలో ఓ గుర్తించదగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారుగా అవతరించింది. ఈ కంపెనీ నుంచి ఇటీవలే ఈ-సిటీ జిప్ అనే ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ రోజువారీ అవసరాలకు సరిగ్గా సరిపోయేలా రూపొందింది. దైనందిన జీవితంలో కూరగాయలు, సరుకులు, వాటర్ టిన్ లను తరలించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
మన దేశంలో కాలుష్య రహిత విద్యుత్ శ్రేణి వాహనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పలు కంపెనీలు, స్మార్టప్ లో ఈ శ్రేణిలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో లెక్ట్రిక్స్ స్టార్టప్ మన దేశంలో ఓ గుర్తించదగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారుగా అవతరించింది. ఈ కంపెనీ నుంచి ఇటీవలే ఈ-సిటీ జిప్ అనే ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ రోజువారీ అవసరాలకు సరిగ్గా సరిపోయేలా రూపొందింది. దైనందిన జీవితంలో కూరగాయలు, సరుకులు, వాటర్ టిన్ లను తరలించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ-సిటీ జిప్ డిజైన్, లుక్స్ .. ఇది క్లాసిక్ లుక్ లో కనిపిస్తుంది. క్లీన్, మినిమలిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. స్టైల్ కు అంతగా ప్రాధాన్యం లేదు. అయితే బాడీ చాలా దృఢంగా ఉంటుంది. 165ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. 155-170కేజీల వరకూ బరువును సులభంగా మోయగలుగుతుంది. ఈ స్కూటర్లో ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. అధునాతన మల్టీ-ఫంక్షన్ డిజిటల్ డిస్‌ప్లే సిస్టమ్, విభిన్న ప్రాధాన్యతల కోసం వివిధ రైడింగ్ మోడ్‌లు, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్), అదనపు అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఒక ఎత్తైన స్వారీ ప్రయాణం. ఇందులో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
ఈ-సిటీ జిప్ స్పెసిఫికేషన్‌లు.. దీనిలో ఎకొ, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్లు ఉంటాయి. ఎకో మోడ్లో గరిష్టంగా 35కిలోమీటర్లు, పవర్ మోడ్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్ ప్రయాణించగలుగుతుంది. ఎకో మోడ్లో సింగిల్ చార్జ్ పై 75కిలోమీటర్లు, పవర్ మోడ్లో సింగిల్ చార్జ్ పై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది. కేవలం ఐదు సెకండ్లలో సున్నా నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. దీని రన్నింగ్ కాస్ట్ కిలోమీటర్లకు కేవలం రూ. 0.12 మాత్రమే. బ్యాటరీ 2కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దీనిని ఫుల్ గా చార్జ్ చేయడానికి 4 నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటుంది.
ఈ-సిటీ జిప్ ధర, లభ్యత.. ఈ స్కూటర్ ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తోంది. అవి ఎలక్ట్రిక్ రెడ్, మూడీ ఆరెంజ్, నియాన్ గ్రీన్, జింగ్ బ్లాక్, జెన్ వైట్. దీని ధర రూ. 1,15,000(ఎక్స్ షోరూం)గా ఉంది.
ఈ-సిటీ జిప్ ఫీచర్లు.. లెక్ట్రిక్స్ అధునాతన ఫీచర్ల శ్రేణిని ఈస్కూటర్లో అందించింది. వీటిలో అధునాతన మల్టీఫంక్షన్ డిజిటల్ డిస్‌ప్లే సిస్టమ్, సమగ్రమైన ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ కాన్ఫిగరేషన్ ఆప్షన్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్), మొబైల్ యాప్ కనెక్టివిటీ, అనేక ఇతర అప్‌డేటెడ్ ఫంక్షన్‌లు ఉన్నాయి. సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, హెవీ-డ్యూటీ బీఎల్డీసీ హబ్ మోటార్‌లు, సరైన బ్యాటరీ ప్యాక్ సెటప్, కంపార్ట్‌మెంట్‌లో విస్తారమైన స్టోరేజ్ స్థలం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..