E-Sprinto Scooters: మార్కెట్‌లోకి రెండు నయా స్కూటర్లను రిలీజ్ చేసి ఈస్ప్రింటో.. వారే అసలు టార్గెట్..!
తాజాగా ఈ-స్ప్రింటో రెండు కొత్త రాపో, రోమీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ల రిలీజ్‌తో ఈ-స్ప్రింటో ఇప్పుడు మొత్తం 18 వేరియంట్‌లతో ఆరు మోడళ్ల స్కూటర్లు ఉన్నట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ స్కూటర్లు మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ తక్కువ ధరకే ఈ నయా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా రాపో ధరలు రూ. 54,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ వాహనాల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఈ-స్ప్రింటో రెండు కొత్త రాపో, రోమీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ల రిలీజ్‌తో ఈ-స్ప్రింటో ఇప్పుడు మొత్తం 18 వేరియంట్‌లతో ఆరు మోడళ్ల స్కూటర్లు ఉన్నట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ స్కూటర్లు మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ తక్కువ ధరకే ఈ నయా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా రాపో ధరలు రూ. 54,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈ-స్ప్రింటో రాపో
ఈ ఈవీ స్కూటర్ కొలతల పరంగా 1840 ఎంఎం పొడవు , 720 ఎంఎం వెడల్పు, 1150 ఎంఎం ఎత్తుతో వస్తుంది. రాపో 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఇది పోర్టబుల్ ఆటో కటాఫ్ ఛార్జర్‌తో కూడిన లిథియం/లీడ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఐపీ 65 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో 250 వాట్స్ బీఎల్‌డీసీ హబ్ మోటార్‌కు శక్తినిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే పూర్తి ఛార్జింగ్ తో 100 కిలోమీటర్ల మైలేజీని కవర్ చేస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్‌ను కలిగి ఉంటుంది. వెనుక సస్పెన్షన్ కాయిల్ స్ప్రింగ్ మూడు-దశల సర్దుబాటు యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కటూర్ 150 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ-స్ప్రింటో రోమీ
ఈ-స్ప్రింటో రోమీ స్కూటర్ ఇది 1800 ఎంఎం పొడవు, 710 ఎంఎం వెడల్పు, 1120 ఎంఎం ఎత్తుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్ 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా పోర్టబుల్ ఆటో కట్ ఆఫ్ ఛార్జర్‌తో లిథియం/లీడ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 250 వాట్స్ బీఎల్‌డీసీ హబ్ మోటార్, ఐపీ 65 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను వస్తుంది. రోమీ కూడా 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. రోమీ స్కూటర్‌లో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్ త్రీ-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్‌తో కూడిన అధునాతన సస్పెన్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి ఈ స్కూటర్ కూడా 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ రెండు మోడల్‌లు రిమోట్ లాక్/అన్‌లాక్, రిమోట్ స్టార్ట్, ఇంజన్ కిల్ స్విచ్/చైల్డ్ లాక్/పార్కింగ్ మోడ్, యూఎస్‌బీ ఆధారిత మొబైల్ ఛార్జింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటాయి. డిజిటల్ కలర్‌ఫుల్ డిస్‌ప్లే బ్యాటరీ స్థితి, మోటార్ వైఫల్యం, కంట్రోలర్ వైఫల్యం గురించి రైడర్‌లకు తెలియజేస్తుంది. రాపో రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండగా రోమీ రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఎంపికలను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..