New Electric Scooter: చిన్నగా.. క్యూట్‌గా ‘ఈ-పాప్’.. అర్బన్ అవసరాలకు బెస్ట్ మోపెడ్.. పూర్తి వివరాలు ఇవి..

బెల్జియన్ కంపెనీ నెకో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు నెకో ఈ-పాప్. ఇది ఫంకీ, కాంపాక్ట్ లుక్లో కనిపిస్తోంది. అర్బన్ అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అలాగే సింగిల్ చార్జ్ పై 60కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిపై ఇద్దరు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించగలిగేలా టూ సీటర్ శ్యాడల్ ఉంటుంది.

New Electric Scooter: చిన్నగా.. క్యూట్‌గా ‘ఈ-పాప్’.. అర్బన్ అవసరాలకు బెస్ట్ మోపెడ్.. పూర్తి వివరాలు ఇవి..
Neco E Pop Electric Scooter
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 01, 2023 | 10:11 PM

గ్లోబల్ వైడ్ గా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. టూ వీలర్ల శ్రేణిలో ఈ-స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఇవి చాలా అనుకూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాల్లోనూ పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఉత్పత్తిదారులు ప్రవేశపెడుతున్నారు. సరికొత్త మోడళ్లలోనే, అన్ని వర్గాల వినియోగదారులకు అవసరమైన రీతిలో టాప్ ఫీచర్లతో వాటిని మార్కెట్లో పరిచయం చేస్తున్నారు. ఇదే క్రమంలో బెల్జియన్ కంపెనీ నెకో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు నెకో ఈ-పాప్. ఇది ఫంకీ, కాంపాక్ట్ లుక్లో కనిపిస్తోంది. అర్బన్ అవసరాల కోసం రూపొందించిన ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అలాగే సింగిల్ చార్జ్ పై 60కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిపై ఇద్దరు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించగలిగేలా టూ సీటర్ శ్యాడల్ ఉంటుంది. ఈ నెకో ఈ-పాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హోండా రక్కస్ మాదిరిగానే..

ఈ అర్బన్ ఈ-మొబిలిటీ మోడల్ సరికొత్తగా ఉంది. ఎప్పుడూ ఉండే విధంగా కాస్త కొత్త టచ్ ఇచ్చారు. పెట్రోల్-ఇంజిన్ స్కూటర్లు, కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే నెకో ఈ స్కూటర్ కి ప్రత్యేకతలను జోడించింది. ఈ-పాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూఎస్ లో సాధారణ ఈ-బైక్ లేదా మోపెడ్ మాదిరిగానే పనితీరు రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది దాని ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్‌తో హోండా రక్కస్‌ను పోలిన డిజైన్‌ను కూడా కలిగి ఉంది. నిజానికి, నెకో ఈ-పాప్ స్కూటర్ ఈ-పాప్ రక్కస్ కాంపాక్ట్ వెర్షన్ లాగా ఉంటుంది.

నెకో ఈ-పాప్  స్పెసిఫికేషన్లు..

ఈ స్కూటర్లో గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందించే 1.2 కిలోవాట్ల హబ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అలాగే 48వోల్ట్స్, 28ఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఇచ్చారు. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 60కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీ స్వాపబుల్ ఉంటుంది. అంటే ఎంచక్కా బయటకు తీసి చార్జ్ పెట్టుకోవచ్చు. అదనంగా ఇంకో బ్యాటరీ ఉంటే.. అధిక మైలేజీ తో పాటు నిరంతర ప్రయాణం చేసే వీలు ఏర్పడుతుంది. ఈ-పాప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లో డబుల్ రియర్ షాక్ సిస్టమ్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ ఉన్నాయి. ఇది ముందు, వెనుక రెండింటిలోనూ 10-అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్‌లను అందిస్తోంది. ఈ-పాప్‌లో పూర్తి ఎల్ఈడీ లైట్లు, కీలెస్ స్టార్ట్, అంతర్నిర్మిత లగేజ్ రాక్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఈ-పాప్ బరువు 55కేజీలు, దాని ఆచరణాత్మక మడత హ్యాండిల్‌బార్లు రవాణాను సులభతరం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

నెకో ఈ-పాప్ ధర, లభ్యత..

నెకో ఈ-పాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర యూరోప్ లో 1,999యూరోలు ఉంటుంది. అంటే దాదాపు 1,120 డాలర్లు, మన కరెన్సీలో అయితే రూ. 1.76లక్షలు ఉంటుంది. ఈ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లు బ్లాక్, ఎల్లో, గ్రీన్, ఆరంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది మన దేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే త్వరలో ఇక్కడకు కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే