AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SGB Scheme: గోల్డ్ బాండ్‌ని ఎవరు కొనుగోలు చేయవచ్చు? ప్రయోజనాలు ఏంటి? ఎక్కడ కొనుగోలు చేయాలి?

సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) అనేది ప్రభుత్వం గోల్డ్ బాండ్ పథకం. ఇది మీకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తుంది. బంగారాన్ని మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గోల్డ్ బాండ్ ద్వారా మీరు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఆర్‌బీఐ ఈ గోల్డ్ బాండ్‌ని జారీ చేస్తుంది. SGBని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు..

SGB Scheme: గోల్డ్ బాండ్‌ని ఎవరు కొనుగోలు చేయవచ్చు? ప్రయోజనాలు ఏంటి? ఎక్కడ కొనుగోలు చేయాలి?
Gold Band
Subhash Goud
|

Updated on: Feb 10, 2024 | 10:27 AM

Share

పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.63000 పైనే ఉంది. బంగారం ఖరీదైపోవడంతో ప్రజలు కోరుకున్నప్పటికీ కొనుగోలు చేయలేకపోతున్నారు. మీరు దాని ధర కారణంగా బంగారం కొనలేకపోతే మీకో శుభవార్త. వచ్చే వారం నుంచి తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 12, 2024 నుండి మీరు మోడీ ప్రభుత్వ గోల్డ్ స్కీమ్ కింద గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి?

సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) అనేది ప్రభుత్వం గోల్డ్ బాండ్ పథకం. ఇది మీకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తుంది. బంగారాన్ని మార్కెట్ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గోల్డ్ బాండ్ ద్వారా మీరు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఆర్‌బీఐ ఈ గోల్డ్ బాండ్‌ని జారీ చేస్తుంది. SGBని డీమ్యాట్‌గా మార్చుకోవచ్చు. ఈ గోల్డ్ బాండ్ ద్వారా మీరు 24 క్యారెట్ల 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు బాండ్‌ను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి చెల్లించినట్లయితే, సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టడంపై మీకు తగ్గింపు కూడా లభిస్తుంది.

మీరు SGBలో ఎప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు?

మీరు సావరిన్ గోల్డ్ బాండ్ 2023-24 సిరీస్ IVలో 12 ఫిబ్రవరి నుండి 16 ఫిబ్రవరి 2024 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంటే ఈ గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఐదు రోజుల సమయం ఉంది. పెట్టుబడి తర్వాత, బాండ్లు ఫిబ్రవరి 21 నుండి జారీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మీరు సావరిన్ గోల్డ్ బాండ్లను ఎక్కడ కొనుగోలు చేయవచ్చు

– మీరు ఆర్‌బీఐ జారీ చేసిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నియమించబడిన వాణిజ్య బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు. – ఇది కాకుండా మీరు దానిని పోస్ట్ ఆఫీస్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేయవచ్చు. -మీరు BSE, NSE ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడిపై వడ్డీని పొందుతారు. గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఏటా 2.4 శాతం వడ్డీని పొందవచ్చు. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ, గోల్డ్ బాండ్లలో మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. ఈ గోల్డ్ బాండ్ నియంత్రణ రిజర్వ్‌ బ్యాంక్‌ చేతిలో ఉన్నందున మీ పెట్టుబడి భద్రత గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు భౌతిక బంగారంపై మూడు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, గోల్డ్ బాండ్లపై జీఎస్టీ ఉండదు. మీరు ఈ బాండ్ ద్వారా రుణం తీసుకోవచ్చు. మీరు బంగారం స్వచ్ఛత గురించి లేదా లాకర్‌లో ఉంచడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతే కాదు, మెచ్యూరిటీ తర్వాత బంగారంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా లభిస్తుంది.

ఈ గోల్డ్ బాండ్‌ని ఎవరు కొనుగోలు చేయవచ్చు?

భారతదేశంలో నివసించే భారతీయులు, భారతీయ సంతతికి చెందిన ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా ట్రస్ట్, UGC ద్వారా గుర్తింపు పొందిన అన్ని విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తిగతంగా మీరు 1 గ్రాము నుండి 4 కిలోగ్రాముల వరకు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.

గోల్డ్ బాండ్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి

మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు కేవలం కొన్ని దశలను అనుసరించాలి.

  • నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
  • -హోమ్ పేజీలోని ప్రధాన మెనూలోకి వెళ్లి, ‘ఈ-సర్వీసెస్’ ఎంచుకుని, ‘సావరిన్ గోల్డ్ బాండ్’పై క్లిక్ చేయండి.
  • -కొత్త వినియోగదారులు ముందుగా నమోదు చేసుకోవాలి. మీరు నమోదు చేసుకున్న తర్వాత లాగిన్‌ కావాలి.
  • అన్ని వివరాలను పూరించిన తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించండి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత, హెడర్ లింక్/సెక్షన్ నుండి కొనుగోలు ఎంపికను ఎంచుకుని, ‘కొనుగోలు’పై క్లిక్ చేయండి
  • సబ్‌స్క్రిప్షన్ పరిమాణం నామినీ వివరాలను నమోదు చేయండి.
  • మొబైల్ నంబర్‌కు పంపిన OTPతో ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి