Plastic Notes: కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నోట్లను తీసుకువస్తోందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మంత్రి

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ ఆర్థిక మంత్రిని ఇతర దేశాలలో చెలామణిలో ఉన్న నోట్లతో ప్రస్తుత పేపర్ కరెన్సీని మార్చే ఆలోచన ఉందా అని అడిగారు. అనేక దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు చాలా మన్నికగా ఉన్నాయని నిరూపించారని, ప్లాస్టిక్ నోట్ల నుంచి నకిలీ కరెన్సీని తయారు చేయడం కూడా చాలా కష్టం కదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి పరిస్థితిలో..

Plastic Notes: కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నోట్లను తీసుకువస్తోందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మంత్రి
Plastic Notes
Follow us

|

Updated on: Feb 08, 2024 | 7:51 AM

Plastic Notes: ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని విడుదల చేయబోతున్నారా? పార్లమెంటులో ప్రభుత్వానికి ఈ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ ఆర్థిక మంత్రిని ఇతర దేశాలలో చెలామణిలో ఉన్న నోట్లతో ప్రస్తుత పేపర్ కరెన్సీని మార్చే ఆలోచన ఉందా అని అడిగారు. అనేక దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు చాలా మన్నికగా ఉన్నాయని నిరూపించారని, ప్లాస్టిక్ నోట్ల నుంచి నకిలీ కరెన్సీని తయారు చేయడం కూడా చాలా కష్టం కదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం దేశంలో కూడా ప్లాస్టిక్ కరెన్సీని జారీ చేయడాన్ని పరిశీలిస్తుందా? అని అడిగారు.

ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా స్పందిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. భారతీయ కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్‌ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపై అనిల్ దేశాయ్ ఆర్థిక మంత్రిని ఒక ప్రశ్న అడగగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక ప్రకారం, మొత్తం రూ. 4682.80 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు ఈ ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదన్నారు.

ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం రూ.10 కోట్ల ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్లాస్టిక్ నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్‌లోని ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును వాయిదా వేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి