Emergency Fund: అత్యవసర నిధి అంటే ఏమిటి? ప్రతీ కుటుంబానికి ఇది ఎందుకు అవసరం?
ఎమర్జెన్సీ ఫండ్ ప్రధాన లక్ష్యం మీకు ఆర్థికంగా సహాయం చేయడమే. కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని గంటలు లేదా రోజుల్లో డబ్బు అవసరం కావచ్చు. అందుకే, మీ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఒక భాగం ఎల్లప్పుడూ మీ వద్ద లిక్విడ్ మనీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిని మీ పొదుపు ఖాతాలో ఉంచుకోవచ్చు. సుమారు 1 నెల ఖర్చులను ఇలా పక్కన పెట్టవచ్చు. మీ ఎమర్జెన్సీ..

చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు సంతోషంగానే ఉంటారు. వాటిపై మంచి ఆదాయం వచ్చేటప్పుడు ఇలాంటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఒకవేళ అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఎల్లప్పుడూ తెలియకుండానే వస్తాయి. అందుకే మీరు దానిని ఎదుర్కోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం. సమస్యలు మీ తలుపు తట్టినప్పుడు, మీ అత్యవసర నిధి మీకు ఆర్థిక రక్షణగా ఉపయోగపడుతుంది. ప్రమాదం, అనారోగ్యం, వేతన తగ్గింపు, ఉద్యోగం కోల్పోవడం లేదా కుటుంబ సభ్యుల మరణం వంటి అనేక సంఘటనల్లో మీకు అత్యవసరంగా డబ్బు అవసరం పడొచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఎందుకు అవసరం?
అత్యవసర నిధి కష్ట సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇది రుణం తీసుకోకుండా ఉండటానికి, మీ పెట్టుబడులు, SIPలను కొనసాగించడానికి మీకు సహాయపడుతుంది. దీనివల్ల మీరు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలను పొందవచ్చు. నిజానికి ఇలాంటి కష్టసమయాల్లో చాలామంది తమ పెట్టుబడులను పక్కన పెట్టేస్తారు.
మీ ఎమర్జెన్సి ఫండ్ ఎంత పెద్దదిగా ఉండాలి?
మీకొచ్చే ఇబ్బందులను మీరు ఎప్పటికీ అంచనా వేయలేరు. అవి మీ కారు చెడిపోయినంత చిన్నవి కావచ్చు లేదా మీ ఉద్యోగాన్ని కోల్పోయేంత ముఖ్యమైనవి కావచ్చు. ఆ ఇబ్బంది నెలల పాటూ ఉండొచ్చు. అటువంటప్పుడు, మీరు మీ ఇంటి ఖర్చుల గురించి మాత్రమే కాకుండా, EMIలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఆర్థిక బాధ్యతలను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే కనీసం 3 నుంచి 6 నెలలకు కుటుంబ ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎమర్జెన్సి ఫండ్‌ని సృష్టించడానికి ముందుగా మీ నెలవారీ ఖర్చు మొత్తాన్ని లెక్కించండి. ఆపై మీకు మిగిలి ఉన్న మొత్తాన్ని అంచనా వేయండి. దీని నుండి మీ ఎమర్జెన్సీ ఫండ్స్ కు నిర్ణీత మొత్తాన్ని కేటాయించండి. అలాగే ఈ అత్యవసర నిధికి మీ వద్ద ఉన్న ఏదైనా మిగులు లేదా అదనపు డబ్బును కేటాయించండి.
ఎమర్జెన్సీ ఫండ్ ప్రధాన లక్ష్యం మీకు ఆర్థికంగా సహాయం చేయడమే. కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని గంటలు లేదా రోజుల్లో డబ్బు అవసరం కావచ్చు. అందుకే, మీ ఎమర్జెన్సీ ఫండ్‌లో ఒక భాగం ఎల్లప్పుడూ మీ వద్ద లిక్విడ్ మనీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిని మీ పొదుపు ఖాతాలో ఉంచుకోవచ్చు. సుమారు 1 నెల ఖర్చులను ఇలా పక్కన పెట్టవచ్చు. మీ ఎమర్జెన్సీ ఫండ్ కార్పస్‌లో మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఇది పొదుపు ఖాతా కంటే ఎక్కువ రాబడిని పొందుతుంది. FDలు కూడా లిక్విడ్‌గా ఉంటాయి. అంటే మీరు ఒక రోజులోపు మీ నిధులను పొందవచ్చు. ఒకవేళ మీ నిర్ణీత గడువుకన్నా ముందే ఎఫ్డీని విత్ డ్రా చేయాల్సి వస్తే.. దీనికి గాను మీరు కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు స్వీప్-ఇన్ FDలను కూడా ఎంచుకోవచ్చు. దీని కింద, మీ పొదుపు ఖాతాలో ఏదైనా అదనపు మొత్తం మీ FD ఖాతాకు ఆటోమేటిక్‌గా బదిలీ చేయబడుతుంది. అదేవిధంగా, మీ సేవింగ్స్ ఖాతాలోని నిధులు నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉంటే, FD ఖాతా నుండి నిధులు దానికి జోడించబడతాయి.
అత్యవసర నిధుల కోసం, మీరు రికరింగ్ డిపాజిట్లు లేదా RDల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రారంభించవచ్చు. అయితే, మీరు సంపాదించే వడ్డీ స్థిరంగా ఉంటుంది. . మీ వద్ద అత్యవసర నిధి లేకుంటే, వెంటనే దాని కోసం ప్లాన్ చేయడం ప్రారంభించండి. తద్వారా ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా మీ పెట్టుబడులు కొనసాగుతాయి. చాలా మంది నిపుణులు మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత భాగాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు. పొదుపు ఖాతాలు, మరియు కొన్ని సందర్భాల్లో, FDలతో పోలిస్తే ఇది అధిక రాబడిని అందిస్తుంది. వారు సాధారణంగా 8-9% వరకు రాబడిని అందిస్తారు, ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. FDలతో పోలిస్తే, వీటి నుంచి వెంటనే నగదును తీసుకోవడానికి కుదరదు. రిడీమ్ చేసిన తర్వాత ఫండ్స్ తిరిగి క్రెడిట్ కావడానికి 1 నుంచి 3 రోజులు సమయం పడుతుంది. కాకపోతే ముందు విత్ డ్రా చేసుకున్నా సరే.. వీటిపై ఎలాంటి జరిమానా ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి