Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: ఖర్చే లేకుండా బ్యాంకు ఖాతా.. ఆ సర్వీసులన్నీ ఫ్రీ..!

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకూ వ‌ృద్ధి చెందుతుంది. దేశంలో జనాభా సంఖ్యకు అనుగుణంగా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నగదు బదిలీ సంక్షేమ పథకాలు కూడా బ్యాంకుల ద్వారా అందిస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతా నిర్వహణ అనేది ఖర్చుతో కూడకున్నది. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాంకు ఖాతా ఎలా పొందాలో? తెలుసుకుందాం.

Bank Account: ఖర్చే లేకుండా బ్యాంకు ఖాతా.. ఆ సర్వీసులన్నీ ఫ్రీ..!
Srinu
|

Updated on: Jun 13, 2025 | 4:08 PM

Share

బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానా విధించడం అనేది పరిపాటిగా మారింది. అయితే జీరో-బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా తీసుకుంటే ఎలాంటి జరిమానాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా మీ ఖాతాను ఎటువంటి తప్పనిసరి కనీస బ్యాలెన్స్ లేకుండా ఎటువంటి జరిమానా రుసుము లేకుండా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని వివరిస్తున్నారు. ఈ ఖాతాలు ఉచిత డెబిట్ కార్డులతో పాటు ATM ఉపసంహరణలు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఆన్‌లైన్ డబ్బు బదిలీలు వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొంటున్నారు. ఖాతాలో కనీస నగదు లేకపోయినా సాధారణ పొదుపు ఖాతాలు అందించే సేవలను ఆశ్వాదించవచ్చు. 

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి ఖాతాలను అధికారికంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్  ఖాతాలు అని పిలుస్తారు. భారతదేశంలోని అనేక అగ్ర బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల పరిమితుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. చాలా బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి. సాధారణంగా నెలలో నాలుగు వరకు ఉండవచ్చు. ఈ పరిమితిని దాటిన తర్వాత బ్యాంక్ మీ జీరో బ్యాలెన్స్ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా మార్చవచ్చు. దీనికి కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడం అవసరం అవతుంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా 

  • ఏటీెం ద్వారా లేదా బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు ఉపసంహరణలు చేయవచ్చు.
  • నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాల ద్వారా డబ్బును స్వీకరించడానికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
  • ప్రాథమిక రూపే ఏటీెం -కమ్-డెబిట్ కార్డ్ ఉచితంగా అందిస్తారు. వార్షిక నిర్వహణ రుసుము ఉండదు.
  • ఖాతాల్లో గరిష్టంగా అనుమతించదగిన బ్యాలెన్స్ రూ. 50,000 వరకు ఉంటుంది. 
  • నెలకు నాలుగు ఉపసంహరణలు మాత్రమే అనుమతి ఉంటుంది. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఫ్యూచర్ ఫస్ట్ సేవింగ్స్ ఖాతా

  • భారతదేశంలోని ఎంపిక చేసిన ప్రముఖ సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులో ఉంది.
  • ఉచిత నిధుల బదిలీలు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఏటీెం వినియోగం, నగదు డిపాజిట్లు/ఉపసంహరణలు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • అన్ని బ్యాంకుల్లో అపరిమిత ఏటీఎం లావాదేవీలు చేయవచ్చు. 
  • ఆహారం, ప్రయాణం, షాపింగ్‌పై ప్రత్యేకమైన డీల్‌లను అందించే వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌తో వస్తుంది.
  • 35 లక్షల వ్యక్తిగత ప్రమాద కవర్ మరియు 1 కోటి రూపాయల విమాన ప్రమాద బీమాను అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

  • బేసిక్ ఖాతా దర్వా సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యాన్ని పొందే అవకాశం.
  • ఫ్రీ పాస్‌బుక్ సర్వీసుతో పాటు ఏటీఎంలలో ఉచిత నగదు డిపాజిట్లతో పాటు విత్‌డ్రా సేవలు
  • రుపే డెబిట్ కార్డు సేవలు
  • నెలకు 4 వరకు ఉచిత ఉపసంహరణలు, వీటిలో ఏటీఎం లావాదేవీలు, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్,  బ్రాంచ్ ఉపసంహరణలు, నిధుల బదిలీలు, స్టాండింగ్ సూచనలు, ఈఎంఐలు, పీఓఎస్ చెల్లింపులు ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ ఖాతా

  • రూపే డెబిట్ కార్డ్ ఉచితంగా జారీ చేస్తారు. రోజువారీ ఏటీఎం విత్‌డ్రా పరిమితి రూ. 40,000, షాపింగ్ పరిమితి రూ. 1,00,000గా ఉంది. 
  • ఉచిత పాస్‌బుక్, నెలవారీ ఇ-స్టేట్‌మెంట్‌లు, ఎస్ఎంఎస్ అలెర్ట్స్
  • మీకు అనుకూలమైన సమయంలో ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఆశ్వాదించవచ్చు. అలాగే నగదు డిపాజిట్లపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి