ఒక్క ప్రమాదం రూ. 12వందల కోట్ల బీమా భారం.. విలవిలలాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
ఒక్క ప్రమాదం 12వందల కోట్ల రూపాయల బీమా క్లెయిమ్‌లకు దారీతీయనుంది. నిన్న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయిన ఘటనలో 241 మంది మృత్యువాత పడ్డారు. మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలపై భారంగా పరిణమించనున్నాయి. ఈ భారం భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై పరిమితంగా ఉండవచ్చు.. యూకే రీఇన్సూరెన్స్ కంపెనీలపై అధిక భారం పడనుంది.

1999లో జరిగిన మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం, విమాన ప్రయాణీకుల మరణం లేదా గాయం వల్ల కలిగే నష్టానికి అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా బాధ్యత వహిస్తాయి. ఫ్లైట్ నష్టం, ప్యాసింజర్, థర్డ్-పార్టీ చెల్లింపులు గ్లోబల్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ సెక్టర్‌పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 120 మిలియన్ డాలర్ల- 150 మిలియన్ డాలర్ల వరకు మన కరెన్సీలో వెయ్యి నుంచి 12వందల కోట్ల రూపాయాలు క్లెయిమ్‌లు ఎదుర్కొననున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదంలో ధ్వంసమైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం విలువ 75 మిలియన్ డాలర్ల నుంచి 85 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి విమానం మొత్తం నష్టం విలువకు క్లెయిమ్ చేస్తే, అంతే మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రమాదంలో చనిపోయిన ప్రతీ ఒక్క ప్రయాణికుడి కుటుంబానికి చెల్లించాల్సిన కోటి రూపాయలు అదనం. ఈ విధంగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 240 కోట్లు అదనంగా ఉంటుంది. విమాన నష్టం, ప్రయాణికులు ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే 12వందల కోట్ల భారం తప్పందటున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..