Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ప్రక్రియ షురూ!

ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు అందజేయనున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ప్రక్రియ షురూ!
Ed On Agrigold
Balaraju Goud
|

Updated on: Jun 13, 2025 | 8:22 PM

Share

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్. దశాబ్దాల పోరాటానికి త్వరలో న్యాయం జరగనుంది. కడుపుకట్టుకుని కూడబెట్టుకున్న సొమ్ము.. మళ్లీ తిరిగి ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. మరి బాధితులకు ఏవిధంగా నష్టపోయిన సొమ్ము అందించనున్నారు. దీనికి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? తెలుసుకుందాం.

ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ.611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించడం ద్వారా మరోసారి విజయాన్ని సాధించింది. అటాచ్‌మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,000 కోట్లు మించిపోయే అవకాశం ఉంది.

ఈ ఏడాది మే నెలలో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 8(8) కింద ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో అటాచ్ చేసిన స్థిర, చర ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీకి విడుదల చేసి, ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించే నిమిత్తంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం (APPDFE), 1999 ప్రకారం పునరుద్ధరించాలని కోరింది. హైదరాబాద్‌లోని మేట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు, ఈ పిటిషన్‌ను జూన్ 10, 2025న ఆమోదించింది. ఈ మేరకు 397 స్థిర ఆస్తుల పునరుద్ధరణకు మార్గం సుగమం అయింది. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు, నివాస, వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

అగ్రి గోల్డ్ గ్రూప్‌పై ఈడీ 2018లో దర్యాప్తు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ & నికోబార్ లలో నమోదైన పలు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈ కేసు విచారణకు వచ్చింది. అగ్రి గోల్డ్ కంపెనీలు అసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పొంజీ స్కీమ్ నడిపి దాదాపు 19 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లను వసూలు చేశాయి. 130కి పైగా కంపెనీలను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ‘ప్లాట్ అడ్వాన్స్’ పేరుతో డిపాజిట్లు వసూలు చేశారు. వేలాది కమిషన్ ఏజెంట్లను నియమించి ప్రజలను మోసం చేశారు. ఈ డబ్బులను వారు ప్రజలకు తెలియకుండా పవర్, డైరీ, ఆరోగ్యం, ఎంటర్‌టైన్‌మెంట్, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఒప్పందం ప్రకారం డబ్బును వెనక్కి ఇవ్వడంలో విఫలమయ్యారు.

ఆస్తుల విలువ: ఈడీ దర్యాప్తులో భాగంగా దాదాపు రూ.4141.2 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది. 2020 డిసెంబర్‌లో అవ్వ వెంకట రామారావు, అవ్వ శేషు నారాయణ రావు, అవ్వ హేమ సుందర వర ప్రసాద్‌ను అరెస్ట్ చేసింది. 2021 ఫిబ్రవరిలో 14 మందిపై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. 2024 మార్చిలో మరో 22 మందిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ సమర్పించారు.

అంతకు ముందు 2025 ఫిబ్రవరిలో రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు పునరుద్ధరించారు (ప్రస్తుత విలువ రూ.6,000 కోట్లు). తాజా పునరుద్ధరణతో కలిపి మొత్తం రూ.3,950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు తిరిగి అప్పగించబడ్డాయి. వాటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.7,000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ చర్యలు నేరస్థుల వద్ద నుండి దోచుకున్న ఆస్తులను తిరిగి న్యాయబద్ధంగా బాధితులకు అప్పగించడంలో ఈడీ తీసుకున్న ప్రాముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

అగ్రిగోల్డ్ స్కామ్ బాధితులకు ఈడీ ఆస్తుల పంపిణీ ప్రక్రియ ఒక చారిత్రక అడుగుగా నిలుస్తుంది. రూ. 7,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను బాధితులకు అందించే ఈ ప్రక్రియ, దశాబ్దకాలంగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ఒక సానుకూల మలుపు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, ఈడీ, సీఐడీ సమన్వయంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని ఆశిస్తున్నారు. ఈ కృషి, ఆర్థిక మోసాల బాధితులకు న్యాయం అందించడంలో ఒక ఆదర్శంగా నిలుస్తుంది, అలాగే భవిష్యత్తులో ఇలాంటి స్కామ్‌లను నిరోధించేందుకు కఠిన చర్యల అవసరాన్ని గుర్తు చేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు
గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు
ఆప్యాయతలో మా అన్నయ్య బంగారం..!
ఆప్యాయతలో మా అన్నయ్య బంగారం..!
బట్టతలసమస్యా ఆందోళన వద్దు బిల్‌బోర్డ్ చేసుకుని డబ్బులుసంపాదించండి
బట్టతలసమస్యా ఆందోళన వద్దు బిల్‌బోర్డ్ చేసుకుని డబ్బులుసంపాదించండి
హోటల్‌లో తేడాగా కనిపించిన నలుగురు మహిళలు.. చెక్ చేయగా..
హోటల్‌లో తేడాగా కనిపించిన నలుగురు మహిళలు.. చెక్ చేయగా..
గాలి జనార్దన్ రెడ్డి కొడుకుతో సినిమా.. శ్రీలీల పారితోషికం ఎంతంటే?
గాలి జనార్దన్ రెడ్డి కొడుకుతో సినిమా.. శ్రీలీల పారితోషికం ఎంతంటే?
జాగ్రత్త.. ఇలాంటి వారికి డబ్బు అప్పుగా ఇచ్చారో నిండా మునుగుతారు..
జాగ్రత్త.. ఇలాంటి వారికి డబ్బు అప్పుగా ఇచ్చారో నిండా మునుగుతారు..
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా..
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా..
స్నానం చేసినా.. కొందరికి ఒంటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది?
స్నానం చేసినా.. కొందరికి ఒంటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది?
ఏడాదికి 3సార్లు మాత్రమే శివయ్య దర్శనం వెయ్యి శివలింగాల క్షేత్రం
ఏడాదికి 3సార్లు మాత్రమే శివయ్య దర్శనం వెయ్యి శివలింగాల క్షేత్రం
ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!
ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!