Aadhar Number: వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డు ఏమవుతుంది? దానిని రద్దు చేస్తారా? నియమాలు ఏమిటి?
నేటి కాలంలో ఆధార్ చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ లేకుండా మీరు ఏ పథకం ప్రయోజనాలను పొందలేరు. ఏ ప్రభుత్వ పనికైనా ఇది అవసరం. అయితే ఒక వ్యక్తి చనిపోతే అతని ఆధార్ కార్డు ఏమవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మరణానంతరం మీ ఆధార్ నంబర్ మరొకరికి వెళుతుందా? మన ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా మూసివేయడం..
నేటి కాలంలో ఆధార్ చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ లేకుండా మీరు ఏ పథకం ప్రయోజనాలను పొందలేరు. ఏ ప్రభుత్వ పనికైనా ఇది అవసరం. అయితే ఒక వ్యక్తి చనిపోతే అతని ఆధార్ కార్డు ఏమవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మరణానంతరం మీ ఆధార్ నంబర్ మరొకరికి వెళుతుందా? మన ఆధార్ కార్డును సరెండర్ చేయడం లేదా మూసివేయడం ఎలా? ఆధార్ కార్డ్ అనేది 12 అంకెల విశిష్ట సంఖ్య. ఇది పేరు, చిరునామా, వేలిముద్రతో సహా అనేక ఇతర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం దాదాపు అసాధ్యంగా మారింది.
ఆధార్ రద్దు కాదు..
చనిపోయిన వ్యక్తి ఆధార్‌ను రద్దు చేయాలనే ప్రశ్న మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును తప్పుగా వాడుకున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఆధార్ కార్డ్ UIDAI ద్వారా జారీ చేస్తుంది కాబట్టి ఏ వ్యక్తి చనిపోయినా అతని ఆధార్ కార్డు రద్దు చేయరు. ఒక వ్యక్తి చనిపోతే అతని ఆధార్‌ను సరెండర్ చేయవచ్చు లేదా మూసివేయవచ్చు అనే నియమం ఇంకా రూపొందించలేదు. మీ ఆధార్ కార్డ్ యాక్టివ్‌గా ఉంటుందని దీని అర్థం. UIDAI ఆధార్ కార్డ్‌ను లాక్ చేసే సదుపాయాన్ని అందించింది. తద్వారా మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది. అలాగే, చనిపోయిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను తర్వాత మరెవ్వరికీ ఇవ్వరు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, అతని/ఆమె ఆధార్ కార్డును లాక్ చేయండి. తద్వారా దానిని ఎవరూ కూడా దుర్వినియోగం చేయరు.
ఇలా ఆధార్ కార్డును లాక్ చేయండి:
- ఆధార్ కార్డు పొందాలంటే www.uidai.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- ఇక్కడ My Aadhaar ఎంచుకుని, ఆపై Aadhaar Servicesపై క్లిక్ చేయండి.
- దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్‌ను నింపాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత Send OTP ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీని తర్వాత బయోమెట్రిక్ డేటాను లాక్/అన్‌లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి