AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లో క్లయిమ్ సెటిల్‌మెంట్..

వైద్యం ఖర్చుల కోసం చేసుకున్న క్లయిమ్ (రూల్ 68జే) లపై ఈపీఎఫ్ ఓ కొన్ని మార్పులు చేసింది. ఆ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. విద్య, వివాహం (రూల్ 68కే), ఇళ్ల నిర్మాణానికి (రూల్ 68బి) సంబంధించి కూడా రూ.లక్ష పొందే అవకాశం కల్పించింది. ఆటో సెటిల్ మెంట్ విధానంలో వీటిని వేగంగా పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

PF Withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లో క్లయిమ్ సెటిల్‌మెంట్..
Epfo
Madhu
|

Updated on: May 21, 2024 | 3:21 PM

Share

పీఎఫ్ అనేది ప్రతి ఉద్యోగికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఉద్యోగం చేసే సమయంలో నెలవారీ కొంత మొత్తాన్ని దీనిలో జమచేస్తారు. ఉద్యోగ విరమణ అనంతరం పెద్ద మొత్తంలో ఆ ఉద్యోగికి అందజేస్తారు. మరి ఆ ఉద్యోగి కి రిటైర్మెంట్ కు ముందు అనుకోని ఖర్చులు వస్తే పరిస్థితి ఏమిటి, అతడి అవసరం ఎలా తీరుతుంది. దీని కోసమే అత్యవసర సమయంలో పీఎఫ్ నుంచి డబ్బులను విత్ర్ డ్రా చేసుకునే వీలుంది. దాని ప్రకారం ఉద్యోగి తన డబ్బులను విత్ డ్రా చేసుకుని, అత్యవసర ఖర్చులకు వాడుకోవచ్చు.

త్వరగా సెటిల్ మెంట్..

ఉద్యోగి తన అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ముందుగా కారణాన్ని వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దీనినే క్లయిమ్ చేయడం అంటారు. ఆ దరఖాస్తును పరిశీలించి, నిబంధనల మేరకు డబ్బులను అతడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇదంతా జరగడానికి కొంత సమయం (సుమారు 15 రోజుల నుంచి నెల) పడుతుంది. దానిని ఇప్పుడు వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ ఓ చర్యలు తీసుకుంది. కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే సెటిల్ చేయనుంది. దీనిలో భాగంగా ఆటో సెటిల్ మెంట్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

మార్పులు ఇవే..

వైద్యం ఖర్చుల కోసం చేసుకున్న క్లయిమ్ (రూల్ 68జే) లపై ఈపీఎఫ్ ఓ కొన్ని మార్పులు చేసింది. ఆ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. విద్య, వివాహం (రూల్ 68కే), ఇళ్ల నిర్మాణానికి (రూల్ 68బి) సంబంధించి కూడా రూ.లక్ష పొందే అవకాశం కల్పించింది. ఆటో సెటిల్ మెంట్ విధానంలో వీటిని వేగంగా పొందే అవకాశం ఉంది.

ఆటో సెటిల్ మెంట్..

ఖాతాల క్లయిమ్ సెటిల్ మెంట్ లను వేగవంతంగా చేసి, వారి అవసరానికి ఉపయోగపడేలా వేగవంతంగా డబ్బులు ఇవ్వడానికి ఈపీఎఫ్ వో తీసుకువచ్చిన విధానమే ఆటో సెటిల్ మెంట్. మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా క్లయిమ్ పరిష్కారమవుతుంది. వైద్యం, ఉన్నత విద్య, విహహం, ఇల్లు కొనుగోలు కోసం ఉపయోగించుకోవచ్చు.

  • పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చందాదారుడు వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యుల వైద్యం కోసం నగదును ఉపసంహరించుకోవచ్చు. నెల, అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా, శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నా విత్ డ్రా చేసుకోవచ్చు. టీబీ, పక్షవాతం, కాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అన్ని పత్రాలు అప్ లోడ్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డీఏ లేదా జమ చేసిన సొమ్ములో ఉద్యోగి వాటా (వడ్డీతో సహా).. రెండింటిలో ఏది తక్కువైతే అంత వరకూ డబ్బులు అందజేస్తారు. దీని కోసం డాక్టర్ సంతకం చేసిన సర్టిపికెట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఉద్యోగి తన, లేదా కుటుంబ సభ్యుల పెళ్లి, పిల్లల చదువు తదితర అవసరాల కోసం పీఎఫ్ ఖాతాను సొమ్మును తీసుకునే వీలుంది. చందదారుడిగా చేరి ఏడేళ్ల పూర్తయిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అది కూాాడా మూడు సార్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బ్యాలెన్స్ లో కనీసం 50 శాతం తీసుకోవచ్చు. వివాహం కోసం అయితే డిక్టరేషన్ అందజేయాలి. చదువు కోసం అయితే సంబంధిత సర్టిఫికెట్ ఇవ్వాలి.
  • ఇల్లు లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, మరమ్మతుల కోసం కూాాడా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. చందదారులు చేరి ఐదేళ్లు పూర్తయిన వారికి కేవలం రెండు స్తార్ల మాత్రమే ఈ విధానంలో అవకాశం ఉంటుంది.

వేగంగా సెటిల్ మెంట్..

ఇలాంటి క్లయిమ్ ల సెటిల్ మెంట్ అత్యంగా వేగంగా జరగనుంది. ఆటో సెటిల్ మెంట్ విధానంలో చాలా సులభంగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో మానవ ప్రమేయం ఉండదు. కేవైసీ, బ్యాంక్ లింక్ అన్ని సక్రమంగా ఉంటే కేవలం 3 నుంచి 4 రోజుల్లో డబ్బులు అందుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!