AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్? ఎక్కడ వడ్డీ రేటు ఎక్కువంటే..

ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు అయిన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులలో ఎఫ్‌డీ రేట్లను ఒకసారి పరిశీలిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సంవత్సరానికి 7.85 శాతం వరకు ఇస్తోంది.

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలంటే.. ఆ మూడు టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఏది బెస్ట్? ఎక్కడ వడ్డీ రేటు ఎక్కువంటే..
Fd Scheme
Madhu
|

Updated on: May 21, 2024 | 4:46 PM

Share

సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. అందుకు ప్రధాన కారణం దీనిలో లభించే అధిక వడ్డీ, కచ్చితమైన రాబడి కారణంగా దీనిలో జనాలు పెట్టుబడులు పెడుతున్నారు. కాగా ఇప్పటి వరకూ వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు జరగలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) రెపో రేటును మార్చకపోవడంతో వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వచ్చే ఈ ఏడాది మళ్లీ వడ్డ రేట్టు తగ్గవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు అయిన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులలో ఎఫ్‌డీ రేట్లను ఒకసారి పరిశీలిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సంవత్సరానికి 7.85 శాతం వరకు ఇస్తోంది. ఇప్పుడు ఈ మూడు బ్యాంకుల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే ప్రస్తుత ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్ల పూర్తి వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు (సంవత్సరానికి)..

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 6 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల లోపు : సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 2 సంవత్సరాల 11 నెలల వరకూ: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.15 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.65 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి 4 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.70 శాతం
  • 4 సంవత్సరాల 7 నెలలు 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.

ఐసీఐసీఐ బ్యాంక్..

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు ఇవి..

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 185 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 271 రోజుల నుంచి సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 6.90 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.

యాక్సిస్ బ్యాంక్..

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు ఇవి..

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 3 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 3 నెలల నుంచి 6 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుంచి 17 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
  • 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.85 శాతం
  • 18 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..