Indian Railways: ఇలా చేశారంటే.! స్లీపర్ టికెట్‌తో హాయిగా ఏసీలో ప్రయాణించవచ్చు..
ప్రతీసారి దూర ప్రయాణాలు చేస్తుంటారా.? రోజు ఏదొక పని మీద రైలు ప్రయాణం చేయాల్సి వస్తుందా.? అయితే మీకో ఫీచర్ చెప్పబోతున్నాం.? ఇలా ట్రై చేస్తే.. మీరు స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ఇంచక్కా ప్రయాణించవచ్చు. అదెలాగో తెలుసా.? ఈ ఆప్షన్ మీరు పొందాలంటే రైలు టికెట్ బుక్ చేసుకునప్పుడు..
ప్రతీసారి దూర ప్రయాణాలు చేస్తుంటారా.? రోజు ఏదొక పని మీద రైలు ప్రయాణం చేయాల్సి వస్తుందా.? అయితే మీకో ఫీచర్ చెప్పబోతున్నాం.? ఇలా ట్రై చేస్తే.. మీరు స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ఇంచక్కా ప్రయాణించవచ్చు. అదెలాగో తెలుసా.? ఈ ఆప్షన్ మీరు పొందాలంటే రైలు టికెట్ బుక్ చేసుకునప్పుడు.. ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో రిజర్వేషన్ టికెట్ల పద్దతి ప్రకారం.. ప్రయాణీకులు ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ లభించేది. ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయ్యేది.
కానీ ఇప్పుడు అలా కాదు.. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణీకులకు తాము ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ దొరక్కపోతే.. వారికి అంతకంటే హయ్యస్ట్ కోచ్‌లో సీట్ లభిస్తుంది. కానీ ఇది జరగాలంటే ఆ బోగీలో కచ్చితంగా సీటు ఖాళీగా ఉండాలి. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఈ అటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్రయాణీకుడు స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే.. ఆ బోగీలో బెర్త్ ఖాళీ లేకపోతే.. అతడికి థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంది. ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ వారికి ఫస్ట్ ఏసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ సౌకర్యం కేవలం హయ్యర్ కోచ్‌ల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లభిస్తుంది. కాగా, ఈ ఆప్షన్ ఎంచుకున్న చాలామంది స్లీపర్ క్లాస్ రైలు టికెట్లతో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే.. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.