AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకునే ముందు నీతా అంబానీ ఏం చేసిందో తెలుసా? ఆమె జీతం ఎంత?

Mukesh Ambani and Nita Ambani: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. నీతా అంబానీ 1985లో ముఖేష్ అంబానీని పెళ్లాడారు. ఈ రోజు ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. అయితే, ఆమె టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిందని మీకు తెలుసా..? ముఖేష్ అంబానీతో పెళ్లి తర్వాత కూడా..

Nita Ambani: ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకునే ముందు నీతా అంబానీ ఏం చేసిందో తెలుసా? ఆమె జీతం ఎంత?
Mukesh Ambani And Nita Ambani
Subhash Goud
|

Updated on: Mar 15, 2024 | 9:15 PM

Share

Mukesh Ambani and Nita Ambani: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. నీతా అంబానీ 1985లో ముఖేష్ అంబానీని పెళ్లాడారు. ఈ రోజు ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. అయితే, ఆమె టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిందని మీకు తెలుసా..? ముఖేష్ అంబానీతో పెళ్లి తర్వాత కూడా ఆమె పని మానలేదు. పెళ్లి తర్వాత కూడా టిచర్‌ ఉద్యోగం కంటిన్యూ చేసిందట.

అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటీవల మార్చి 1 నుండి 3 వరకు జామ్‌నగర్‌లో జరిగింది. దీంతో అంబానీ కుటుంబం మరోసారి వెలుగులోకి వచ్చింది. ముకేష్, నీతా అంబానీలు తమ ముగ్గురు పిల్లల వివాహంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వారు తమ పిల్లలకు ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించారు. అయితే పాత ఇంటర్వ్యూలో నీతా అంబానీ ఒక బిలియనీర్ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్న తర్వాత కూడా టీచర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదని చెప్పారు.

ముఖేష్ అంబానీ – నీతా అంబానీ సిమి గ్రేవాల్ చాట్ షోలో కనిపించినప్పుడు, అక్కడ ఇద్దరూ తమ కుటుంబం గురించి చాలా పెద్ద విషయాలు వెల్లడించారు. నీతా అంబానీ తన పని పట్ల చాలా మక్కువతో ఉన్నారని చెప్పారు. వారి వివాహం అయిన మూడు వారాల తర్వాత అప్పటికే ఆమె ఉద్యోగం చేస్తున్న సన్‌ఫ్లవర్ నర్సరీలో బోధించడం ప్రారంభించారట. పెద్ద పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఉద్యోగం మానేయలేదు. ఆ సమయంలో తనకు వచ్చే జీతం అంతగా లేకపోయినా, ఆ పనితో తాను ఆనందాన్ని పొందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇవి కూడా చదవండి

పెళ్లి తర్వాత నీతా అంబానీ చాలా ఏళ్లు పనిచేశారు:

పెళ్లికి ముందు నీతా అంబానీ టీచర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టనని ముఖేష్ అంబానీ ముందు షరతు పెట్టిందట. అంబానీ కుటుంబానికి ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమె 1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత తన ఉద్యోగాన్ని నిలబెట్టుకున్నారు. అప్పట్లో నెలకు రూ.800 జీతం వచ్చేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ముఖేష్ అంబానీ సరదాగా మాట్లాడుతూ, ‘ఆ జీతం మొత్తం తనదే. మా తిండికి సరిపోయే ఖర్చులన్ని కూడా ఆమె చెల్లిస్తుండేది. నీతా అంబానీ నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి పట్టభద్రురాలైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు..!
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
బతికితే ఆ హీరోలా బతకాలి.. జగపతి బాబు..
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే