REIT Investments: రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపు.. ఆర్ఈఐటీల ద్వారా పెట్టుబడికి భరోసా
ఇటీవల కాలంలో రియల్ ఎస్టే రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. అయితే పెట్టుబడులు ఎంత పెరిగినా రాబడి విషయంలో మాత్రం పెట్టుబడిదారులు కొంత అసంతృప్తికి లోనవతూ ఉన్నారు. ఇలాంటి భారతీయ పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఈఐటీల గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో ఎవరైనా తమ భూమిని జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న భూములు కొనుగోలు ఆసక్తి చూపుతారు. అయితే వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. మంచి ప్రదేశంలో ఆఫీస్, రిటైల్ స్థలాల్లో ఈ స్కీమ్ ద్వారా గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అంటే వివిధ రంగాల్లో ఆదాయాన్ని సృష్టించే రియల్ ఎస్టేట్‌ను కలిగి ఉన్న, నిర్వహించే లేదా ఆర్థిక సహాయం చేసే సంస్థ. ఆర్ఈఐటీలు అంటే రియల్ ఎస్టేట్ కోసం మ్యూచువల్ ఫండ్‌లుగా నిపుణులు అభివర్ణిస్తారు. భారతదేశంలో ఆర్ఈఐటీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వార నియంత్రణలో ఉంటాయి. అలాగే వాటి ఆస్తుల్లో కనీసం 80% పూర్తయిన, ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి. వాణిజ్య కార్యాలయ స్థలాలు, షాపింగ్ మాల్స్, గోడౌన్స్, హోటళ్లు వంటి వాటిల్లో పెట్టుబడికి అవకాశం ఉంటుంంది.
ఆర్ఈఐటీలు ఈ ఆస్తుల అద్దెదారుల నుంచి అద్దెను వసూలు చేస్తాయి. ఆ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వారి యూనిట్ హోల్డర్లకు పంపిణీ చేస్తాయి. ఆర్ఈఐటీలు ప్రధానంగా వారు నిర్వహించే ఆస్తుల నుంచి అద్దె, లీజు ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. ఈ ఆదాయం పెట్టుబడిదారులకు ఈ రూపంలో పంపిణీ చేస్తాయి. డివిడెండ్లు, వడ్డీ ఆదాయం, మూలధన లాభాలు పెట్టుబడిదారులకు రాబడినిస్తాయి. భారతీయ ఆర్ఈఐటీలు తమ నికర పంపిణీ చేసే నగదు రాబడిలో కనీసం 90 శాతం పెట్టుబడిదారులకు పంపిణీ చేయాలి. ఇది సాధారణ ఆదాయాన్ని కోరుకునే వారికి ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తుంది.
ఆర్ఈఐటీలు షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేసి, వర్తకం కూడా చేయవచ్చు. కాబట్టి మీరు ఆర్ఈఐటీ యూనిట్లను కొనుగోలు చేసినప్పుడు మీరు తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో పాక్షిక యాజమాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లెక్క ప్రస్తుతం భారతదేశంలో నాలుగు లిస్టెడ్ ఆర్ఈఐటీలు ఉన్నాయి.
ఆర్ఈఐటీలు ఇవే
- ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ – భారతదేశపు మొట్టమొదటి, అతిపెద్ద ఆర్ఈఐటీ, వాణిజ్య కార్యాలయ ఆస్తులపై దృష్టి సారించింది.
- మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ – ప్రధాన నగరాల్లో ప్రీమియం బిజినెస్ పార్కులను కలిగి ఉంది.
- బ్రూక్‌ఫీల్డ్ ఇండియా ఆర్ఈఐటీ – బలమైన ఆఫీస్ పోర్ట్‌ఫోలియోతో కెనడియన్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ స్పాన్సర్ చేసింది.
- నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఆర్ఈఐటీ – భారతదేశపు మొట్టమొదటి రిటైల్ ఆర్ఈఐటీ, షాపింగ్ మాల్స్ మరియు పట్టణ వినియోగ స్థలాలపై దృష్టి పెట్టింది.
ఆర్ఈఐటీలు లిక్విడిటీ, ట్రేడింగ్ పరంగా ఈక్విటీల్లానే ఉంటాయి. అయితే వాటి రాబడి అద్దె దిగుబడి, ఆక్యుపెన్సీ రేట్ల ద్వారా నడుపుతారు. సాంప్రదాయ స్టాక్‌ల వంటి కార్పొరేట్ ఆదాయాల ద్వారా కాదు. భారతదేశంలో ఆర్ఈఐటీలు సాధారణంగా 7–9 శాతం వార్షిక రాబడిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




