Volvo EX30: టెస్లా, వోక్స్‌వ్యాగన్‌కు పోటీగా వోల్వో సరికొత్త కార్.. అదిరిపోయిన లేటెస్ట్ ఫీచర్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?
తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన వోల్వో ఈఎక్స్ 30 పేరుతో ఎంట్రీ లెవెల్ ఎస్‌మూవీను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి. ఈ కార్ టెస్లా కంపెనీకు సంబంధిచిన వై, వోక్స్‌వ్యాగన్ ఐడీ.4, కియా ఈవీ 6 వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఈ కార్ గురించిన ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది. టూ వీలర్స్ దగ్గర నుంచి కార్ల వరకూ ఈవీ వెర్షన్లలో రిలీజ్ చేయడానికి కంపెనీలు మక్కువ చూపుతున్నాయి. అయితే కార్ల విషయానికి వచ్చేసరికి టాప్ కంపెనీలే ఈవీ రంగంలో దుమ్మురేపుతున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన వోల్వో ఈఎక్స్ 30 పేరుతో ఎంట్రీ లెవెల్ ఎస్‌మూవీను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి. ఈ కార్ టెస్లా కంపెనీకు సంబంధిచిన వై, వోక్స్‌వ్యాగన్ ఐడీ.4, కియా ఈవీ 6 వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఈ కార్ గురించిన ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం. వోల్వో ఈఎక్స్ 30 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సీ 40, ఎక్స్‌సీ 40 మోడళ్లకు జోడింపుగా ఉంటుంది. ముఖ్యంగా ఈఎక్స్ 30 ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎక్స్‌సీ 40తో పోలిస్తే చాలా చిన్నపరిమాణంలో ఉంటుంది. అయితే చిన్న పరిమాణంలో వచ్చినా ఈ కారులో ఇప్పటికీ వోల్వో వాహనాలకు చెందిన విలక్షణమైన డిజైన్ అంశాలను ఉన్నాయి.
టీజర్ చిత్రాల ప్రకారం ఈ వోల్వో ఎస్‌యూవీ సూపర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, క్లోజ్డ్ ప్యానెల్‌తో సొగసైన ఫ్రంట్ ప్రొఫైల్, నిలువుగా ఆధారిత ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లతో వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కార్ 2024లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం వినియోగదారులకు రెండు విభిన్న బ్యాటరీ ఎంపికల మధ్య ఎంపికను అందిస్తుంది. ఎంట్రీ-లెవల్ మోడల్ 51 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అయితే హై-ఎండ్ వేరియంట్ మాత్రం శక్తివంతమైన 69 కేడబ్లూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కార్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 480 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కార్ వోల్వో కంపెనీ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అత్యంత పర్యావరణ అనుకూల వాహనమని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ మోడల్‌లోనూ లేనంత తక్కువ కార్బన్‌తో ఈ కార్ వరస్తుంది. ఈఎక్స్ 30 సీఓ2 ఉద్గారాల్లో గణనీయమైన 25 శాతం తగ్గింపును సాధించగలదని అంచనా. వోల్వో ఈఎక్స్ 30 ఇడార్ టెక్నాలజీతో వస్తుందని అదువల్ల ఈ కార్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని వోల్వో పేర్కొంది. అయితే వోల్వో రిలీజ్ చేసిన ఈ కార్‌ను అధికారికంగా జూన్ 7న ప్రవేశపెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి