Zen Micro POD EV: ఆ ఈవీకి ఇప్పటికే 10,000 ప్రీ బుకింగ్స్.. లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం..

లాజిస్టిక్ ఇండస్ట్రీకు అవసరమయే ఈవీలు కొన్ని రిలీజ్ చేసినా అవి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాజాగా గుర్గావ్‌లోని మనేసర్‌లో ఉన్న ఈవీ స్టార్టప్ కంపెనీ జెన్ మొబిలిటీ లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే ఓ ఈవీ వాహనాన్ని రిలీజ్ చేసింది.

Zen Micro POD EV: ఆ ఈవీకి ఇప్పటికే 10,000 ప్రీ బుకింగ్స్.. లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం..
Zen Mobility
Follow us

|

Updated on: May 31, 2023 | 6:30 PM

ప్రస్తుతం భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు అందరూ ఈవీ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈవీలను ఎప్పటికప్పుడు టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ రిలీజ్ చేస్తున్నాయి. అయితే లాజిస్టిక్ ఇండస్ట్రీకు అవసరమయే ఈవీలు కొన్ని రిలీజ్ చేసినా అవి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాజాగా గుర్గావ్‌లోని మనేసర్‌లో ఉన్న ఈవీ స్టార్టప్ కంపెనీ జెన్ మొబిలిటీ లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే ఓ ఈవీ వాహనాన్ని రిలీజ్ చేసింది. జెన్ మైక్రో పీఓడీ ఈవీ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఈవీ ఆటో ట్రాలీ 150 కిలోలను మోసే పే లోడ్ కెపాసిటీతో వస్తుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఆర్ 5ఎక్స్, ఆర్ 10 ఎక్స్ 120 కిలోల మోసే పేలోడ్‌తో వచ్చాయి. వాటికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా తాజా ఈవీ నిలువనుంది. ముఖ్యంగా ఈ ఈవీలో పేటెంట్ పొందిన డ్రైవ్ ఇన్ ట్రైన్‌ ఉంది. 

జెన్ మైక్రో ప్యాడ్ ఇప్పటికే టాప్ లాజిస్టిక్స్ కంపెనీ నుంచి 10,000 యూనిట్ల ప్రీ ఆర్డర్ వచ్చినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జెన్ మొబిలిటీ మనేసర్‌లో సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లను చేసిందని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎర్గోనమిక్ వాహనం కనిష్ట రన్నింగ్ కాస్ట్‌తో వస్తుంది. దీన్ని ఓ సారి చార్జ్ చేయాలంటే కేవలం నాలుగు యూనిట్ల విద్యుత్ సరిపోతుంది. అలాగే 1.5 గంటల నుంచి రెండు గంటల్లోపే ఈ వాహనం పూర్తిగా చార్జ్ అవుతుంది. ముఖ్యంగా లైట్ వెయిట్ వాహనం కావడంతో బ్యాటరీ ఖర్చులను తగ్గించి డెలివరీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ జెన్ మైక్రో పీఓడీ డిజైన్‌ను పరిశీలిస్తే రైడర్ సౌలభ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మృదువైన రైడింగ్ కోసం నమ్మకమైన బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఈ త్రీవీలర్ లాజిస్టిక్ ఈవీ వెహికల్‌లో ఇచ్చే కార్గో బాక్స్‌ లోపల నచ్చినట్లు డిజైన్ చేసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తుంది. ఈ చర్య ముఖ్యంగా మెడికో లాజిస్టిక్స్ వారికి అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఈవీలో జియో ఫెన్సింగ్, వాహన లాకింగ్, రిమోట్ లాకింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ వాహనంలో డ్రైవ్ ట్రైన్, టెలీమ్యాటిక్స్  నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే ఈ వాహనాన్ని 1,50,000 కిలోమీటర్లు కఠినమైన పరిస్థితుల్లో పరీక్షించినా మంచి పనితీరును కనబరిచిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!