Cheapest electric scooters: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చీప్ అండ్ బెస్ట్.. లోకల్ అవసరాలకు నంబర్ వన్ చాయిస్..

మీకు ఈ రోజు అతి తక్కువ బడ్జెట్.. ఎంత తక్కువ అంటే మీరు మంచి ఫీచర్లున్న ఓ స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. సిటీ పరిధిలో ట్రాఫిక్ ను ఈజీగా దాటుకుంటూ.. ఇంటి అవసరాలను సులభంగా తీర్చడానికి ఈ బైక్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

Cheapest electric scooters: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చీప్ అండ్ బెస్ట్.. లోకల్ అవసరాలకు నంబర్ వన్ చాయిస్..
Ujaas Ezy Electric Scooter
Follow us

|

Updated on: May 20, 2023 | 6:13 PM

ఆటో రంగం ‘ఎలక్ట్రి’ఫై అవుతోంది. ఒక వైపు ద్విచక్ర వాహనాలు, మరోవైపు కార్లు, బస్సులు విద్యుత్ శ్రేణిలోకి మార్పు చెందుతున్నాయి. అయితే వినియోగదారుల నుంచి సాధారణంగా వస్తున్న ఫిర్యాదు చార్జింగ్ స్టేషన్లు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో పాటు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర ఎక్కువగా ఉండటం. అయితే మీకు ఈ రోజు అతి తక్కువ బడ్జెట్.. ఎంత తక్కువ అంటే మీరు మంచి ఫీచర్లున్న ఓ స్మార్ట్ ఫోన్ కి పెట్టే ఖర్చుకన్న తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మీకు పరిచయం చేస్తున్నాం. సిటీ పరిధిలో ట్రాఫిక్ ను ఈజీగా దాటుకుంటూ.. ఇంటి అవసరాలను సులభంగా తీర్చడానికి ఈ బైక్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉజాస్ ఈజీ(Ujaas eZy)..

ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 250వాట్ల మోటార్ ఉంటుంది. ఇది 75ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. దీని ధర కేవలం రూ. 31,880(ఎక్స్ షోరూమ్) ఉంటుంది. ఇది ఎల్ఏ 48 వోల్ట్స్ కలిగిన ఒక వెర్షన్లోనే మాత్రమే అందుబాటులో ఉంది.

ఏవాన్ ఈ ప్లస్(Avon E Plus)..

ఈ స్కూటర్లో 48V/12 Ah సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 50 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది గరిష్టంగా గంటలకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 220 వాట్ల సామర్థ్యంతో బీఎల్ఢీసీ మోటార్ ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. దీనిలో మూడు డ్రైవింగ్ ఆప్షన్లు ఉంటాయి. మ్యాన్యువల్, ఎలక్ట్రిక్, పెడల్ అసిస్టెడ్. నైట్ విజన్ కోసం మల్టీ రిఫ్లెక్టర్ , టైల్ ల్యాంప్ ఉంటుంది. ఈ బైక్ ఎట్రాక్టివ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. దీని ధర రూ. 25,000(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇది కూడా ఏవాన్ ఈ ప్లస్ పేరిట ఒకే వెర్షన్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

వెలెవ్ మోటార్స్ వీఈవీ01(Velev Motors VEV 01)..

దీనిలో 48 V/24 Ahసామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 75 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గరిష్టంగా గంటకు 25కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. మోటార్ 250వాట్ల సామర్థ్యంతో ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది. దీని ధర కేవలం రూ. 32,500 మాత్రమే. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వెలెవ్ మోటార్స్ వీఈవీ01, వెలెవ్ మోటార్స్ వీఈవీ01ఎస్టీడీ పేర్లతో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..