Indian Railways: రైలు టికెట్ తీసుకున్న తర్వాత బోర్డింగ్ స్టేషన్‌ని మార్చాలనుకుంటున్నారా? ఈ నిబంధనలు తెలుసుకోండి
రైలు ప్రయాణం అంటే అందరికి ఇష్టమే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటాము. గతంలో రైలు టికెట్ బుక్ చేయాలంటే క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నచోటి..
రైలు ప్రయాణం అంటే అందరికి ఇష్టమే. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటాము. గతంలో రైలు టికెట్ బుక్ చేయాలంటే క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్నచోటి నుంచే రైలు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైన తర్వాత ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసే సదుపాయం వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సలేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చొచ్చు. అంటే మీరు రైలు ఎక్కాలనుకున్న స్టేషన్‌లో కూడా ఆన్‌లైన్‌లో మార్పులు చేయవచ్చు.
ఉదాహరణకు ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ నుంచి ముంబాయి వెళ్లేందుకు రైలు టికెట్ బుక్ చేశాడని అనుకుందాం. ఈ రైలు బేగంపేట మీదుగా ముంబాయి వెళ్తుంది. ఆ ప్రయాణికుడు తన బోర్డింగ్ స్టేషన్‌ను బేగంపేటకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. బేగంపేట మాత్రమే కాదు.. ఆ దారిలో ఏ స్టేషన్‌లో అయినా రైలు ఎక్కడానికి బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. బేగంపేటకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్న తర్వాత మళ్లీ సికింద్రాబాద్‌లో రైలు ఎక్కకూడదు. అయితే తప్పనిసరిగా సదరు ప్రయాణికుడు బోర్డింగ్ స్టేషన్ మార్చాల్సి ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ మార్చకుండా రైలు బుకింగ్ చేసిన స్టేషన్‌లో కాకుండా ఇతర స్టేషన్‌లో రైలు ఎక్కకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికులను టికెట్ తీసుకున్న తర్వాత కూడా వారి ముందుగా నిర్ణయించిన బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవడానికి అనుమతిస్తుంది.
భారతీయ రైల్వే నియమాలు:
ధృవీకరించబడిన టిక్కెట్‌ను బుక్ చేసుకున్న తర్వాత కూడా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో రిజర్వేషన్ ఉన్నప్పటికీ వేరే స్టేషన్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభించే సౌకర్యాన్ని రైల్వే అందిస్తుంది. మీరు మీ ఇంటి వద్ద బోర్డింగ్ స్టేషన్‌ని మార్చే ప్రక్రియను సులభంగా చేయవచ్చు. ఇది మాత్రమే కాదు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చడం వల్ల రైల్వేశాఖ ఎలాంటి జరిమానా విధించదు. రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ని షెడ్యూల్ చేసిన ప్రయాణానికి 24 గంటల ముందు వరకు మార్చుకోవచ్చు.
బోర్డింగ్ స్టేషన్‌ని ఎలా మార్చాలి?
- బోర్డింగ్ స్టేషన్‌ని మార్చడానికి, ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- అక్కడ టికెట్ బుకింగ్ హిస్టరీ విభాగానికి వెళ్లండి.
- ఈ విభాగంలో మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చడానికి ఎంపికను పొందుతారు. దాన్ని ఎంచుకోండి.
- తర్వాత, మీకు నచ్చిన బోర్డింగ్ స్టేషన్‌ని ఎంచుకోండి.
- కన్ఫర్మ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీ ఎంపికను నిర్ధారించండి.
- తర్వాత, మీ బోర్డింగ్ స్టేషన్‌ని మార్చడానికి మీరు చేసిన ప్రయత్నం విజయవంతమైందని నిర్ధారించడానికి మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌ని అందుకుంటారు.
మరిన్ని బిజినెస్ వా ర్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి