Electric Scooter: క్యూట్ లుక్.. కిల్లింగ్ ఫీచర్లు.. సింగిల్ చార్జ్ పై 132 కిమీ. ఈ-స్కూటర్ మామూలుగా లేదుగా..
బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అధునాత ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. పలు రకాల డ్రైవింగ్ మోడ్లతో విశేషమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కబ్బీ స్టోరేజ్ ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లో విడుదలవుతోంది. వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. మంచి ఫీచర్లతో పాటు అధిక రేంజ్, అనువైన బడ్జెట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాట్ రే కంపెనీ నుంచి స్టోర్ ఐఈ స్కూటర్ మార్కెట్లో లాంచ్ చేసింది. మంచి రెట్రో లుక్ ఈ స్కూటర్ కిక్కెక్కిస్తోంది. దీని ధర రూ. 89,600గా ఉంది. ఈ క్రమలో ఈ స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫీచర్లు ఇవి..
బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అధునాత ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. పలు రకాల డ్రైవింగ్ మోడ్లతో విశేషమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కబ్బీ స్టోరేజ్ ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. సైడ్ అద్దాల రియర్ వ్యూ చక్కగా ఉంటుంది. నైట్ హెడ్ ల్యాంప్ ఆన్ చేస్తే హార్న్ సౌండ్ తగ్గుతుంది. ముందువైపు వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. హ్యాండిల్ కు కుడి వైపున స్కూటర్ రైడింగ్ మోడ్లను చేంజ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. రివర్స్ మోడ్ కూడా ఉంటుంది.
రేంజ్, ధర..
బ్యాట్ రే నుంచి వచ్చిన ఈ స్టోర్ ఐఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,600 ఎక్స్ షోరూం ఉంది. దీనిలో ఎకో, స్పోర్ట్స్, కంఫర్ట్ అనే డ్రైవింగ్ మోడ్లు ఉంటాయి. ఒక్కో మోడ్లో ఒక్కో రకమైన టాప్ స్పీడ్ ఉంటుంది. టాప్ స్పీడ్ ఒక్కటే ఈ మోడ్లలో తేడా. ఈ స్కూటర్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 132 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సీటు వెడల్పుగా స్టిఫ్ గా ఉంటుంది. డైరెక్ట్ సన్ లైట్లో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ వినియోగించడం కాస్త కష్టమవుతుంది . హెడ్ ల్యాంప్ లో హాలోజెన్ ల్యాంప్ ను వినియోగించారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..