AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nissan Magnite Geza: అదిరిపోయే సూపర్ కార్ రిలీజ్ చేసిన నిస్సాన్.. వాళ్లే అసలు టార్గెట్

స్టార్టింగ్ నుంచి మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా కార్లను రిలీజ్ చేస్తున్న నిస్సాన్ కంపెనీ తాజాగా భారతీయ మార్కెట్‌లో ఓ సరికొత్త కార్‌ను రిలీజ్ చేసింది. మాగ్నైట్ గెజా పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్ ధర రూ.7.39 లక్షలు మాత్రమేనని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Nissan Magnite Geza: అదిరిపోయే సూపర్ కార్ రిలీజ్ చేసిన నిస్సాన్.. వాళ్లే అసలు టార్గెట్
Nissan Magnite Geza
Nikhil
|

Updated on: May 31, 2023 | 4:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో కార్ అనేది ఓ స్టేటస్ సింబల్లా మారింది. చాలా మంది మధ్యతరగతి ఉద్యోగులు కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లేందుకు కచ్చితంగా కార్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ధరల విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. భారతదేశంలో మధ్యతరగతి ప్రజల జనాభా భారీగా ఉంటుంది. కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో కార్లను రిలీజ్ చేస్తూ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా కార్లను రిలీజ్ చేస్తున్న నిస్సాన్ కంపెనీ తాజాగా భారతీయ మార్కెట్‌లో ఓ సరికొత్త కార్‌ను రిలీజ్ చేసింది. మాగ్నైట్ గెజా పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్ ధర రూ.7.39 లక్షలు మాత్రమేనని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కంపెనీ చాలా కాలం క్రితం ఈ కొత్త మోడల్ గురించి పేర్కొంది. అయితే తాజాగా ఈ కార్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి రూ.11,000తో ప్రీ బుకింగ్ కూడా మొదలు పెట్టింది. అయితే ఈ కార్ ఫీచర్ల విషయంపై ఓ లుక్కేద్దాం.

సరికొత్తగా గెజా ఎస్‌యూవీ జపనీస్ థియేటర్, మ్యూజికల్ థీమ్‌ల నుంచి ప్రేరణ పొందింది. అలాగే ఆయా థీమ్‌ల స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ, జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన కొత్త 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఈ తాజా కార్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కార్ ముఖ్యంగా యాప్ ఆధారిత నియంత్రణలతో కూడిన యాంబియంట్ లైటింగ్‌తో అమర్చారు. అలాగే వెనుక కెమెరా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇతర ఫీచర్లలో షార్క్ ఫిన్ యాంటెన్నా, లేత గోధుమరంగు అప్హోల్స్టరీ వంటివి ఉన్నాయి. అయితే ఇవి కేవలం ఐచ్చికమని గుర్తుంచుకోవాలి.  ఈ కార్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే 70 హెచ్‌పీ 96 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కార్ 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. అలాగే కొత్త మ్యాగ్నెట్ గెజా ఐదు రంగు ఎంపికలతో వస్తుంది. ఈ కారు హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి వాటికి పోటీగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి