Bike Sales: సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్ ఉందా.? రూ. 20 వేలకే ఇంటికి తెచ్చుకోండి!
సాధారణంగా కొత్త బైక్ కొనాలంటే.. కచ్చితంగా మనం రూ. లక్ష వరకు డబ్బును చేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలామంది తమకు నచ్చిన బైక్‌లు కొనుగోలు..
సాధారణంగా కొత్త బైక్ కొనాలంటే.. కచ్చితంగా మనం రూ. లక్ష వరకు డబ్బును చేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలామంది తమకు నచ్చిన బైక్‌లు కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఆప్షన్ తీసుకుంటుంటే.. మరికొందరు ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లించి తీసుకుంటుంటారు. అయితే సామాన్యులకు ఇది చాలా ఎక్కువ బడ్జెట్.. అందుకే వారందరూ కూడా సెకండ్ హ్యాండ్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు సెకండ్ హ్యాండ్ బైక్‌లను తక్కువ ధరలకే అమ్మకానికి ఉంచారు. ఇప్పుడు మీ ముందుకు ‘డ్రూమ్’ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న హీరో ప్యాషన్ ప్లస్ సెకండ్ హ్యాండ్ బైక్ చెప్పబోతున్నాం.
డ్రూమ్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. హీరో ప్యాషన్ ప్లస్ 100 సీసీ బైక్ కేవలం రూ. 19, 500కి దొరుకుతోంది. ఇది 2002 మోడల్ బైక్ కాగా.. ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు తిరిగింది. ఈ బైక్ హైదరాబాద్ లొకేషన్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 55 కిలోమీటర్లు ఇస్తుంది.
అలాగే మరో బైక్ బజాజ్ పల్సర్ కూడా తక్కువ ధరకే లభిస్తోంది. 2005 మోడల్ బజాజ్ పల్సర్ రూ. 19 వేలకు దొరుకుతోంది. ఇప్పటివరకు ఈ వాహనం 32 వేల కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్‌లో దొరుకుతుండగా.. ఈ బైక్ లీటర్‌కు 60 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తుంది. కాగా, సెకండ్ హ్యాండ్ బైకులు కొనేటప్పుడు.. బైక్ ఫీచర్లు, దాని మైలేజ్ అలాగే ముఖ్యమైన పత్రాలు తప్పక చూసుకోవాలి. ఆ తర్వాత ఆర్ధిక లావాదేవీలు జరిపితే మంచిది.