UPI: ఇకపై పిన్‌తో పనిలేదు.. ఇలా చేస్తే వెంటనే ట్రాన్సాక్షన్.. త్వరలోనే..
యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారుల కోసం చెల్లింపు వ్యవస్థలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెద్ద మార్పు తీసుకురాబోతోంది. త్వరలో యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్ చేయనుంది. దీన్ని ప్రకారం పిన్ లేకుండానే చెల్లింపు చేయవచ్చు. అది ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటిల్ పేమెంట్సే.. కూరగాయల నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ వరకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్నే వాడుతున్నారు. యూపీఐ ఛార్జీలపై ఎటువంటి ఛార్జీలు లేకపోవడం కూడా డిజిటల్ పేమెంట్స్ పెరగడానికి ఓ కారణంగా. ఇక ఎప్పటికప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే యూపీఐ బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటిపై లిమిట్ పెట్టింది. ఈ క్రమంలో ప్రజలకు ట్రాన్సాక్షన్ ఈజీగా అయ్యేలా మరో అప్డేట్ తీసుకొచ్చేందుకు ఎన్పీసీఐ సిద్ధమైంది. ఇది యూపీఐ చెల్లింపులు చేసే వ్యక్తులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. వినియోగదారులు పిన్ నమోదు చేయకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తీసుకురావడానికి ఎన్పీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఇకపై యూజర్స్ పిన్ ఎంటర్ చేయకుండానే ఫేస్ లేదా ఫింగర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అయితే పిన్ కోసం కూడా ఆప్షన్ ఉంటుంది.
ఇది ఎలా పని చేస్తుంది?
యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్తో వినియోగదారులు చెల్లింపు చేయడానికి పిన్ నమోదు చేయవలసిన అవసరం లేదు. ఫేస్ లేదా ఫింగర్ ను యూజ్ చేస్తే సరిపోతుంది. అనేక పిన్ నంబర్‌లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. కొన్ని అప్‌డేట్‌ల ప్రకారం.. బయోమెట్రిక్ అప్‌డేట్ తర్వాత మీరు క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు, బయోమెట్రిక్ అంటే ఫింగర్ లేదా ఫేస్ ఆప్షన్ పిన్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులు దానిపై క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది.
ఈజీ – భద్రత
బయోమెట్రిక్ అప్డేట్తో ఎక్కువ చదువుకోని కూడా ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వారికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రజలు ఎన్నో యాప్స్ వాడుతూ.. అన్ని పిన్ నంబర్లను గుర్తుంచుకోవడం కష్టంగా మారుతుంది. ఫోన్ పాస్‌వర్డ్ నుండి ఏటీమ్ వరకు అనేక నంబర్‌లను గుర్తుంచుకోవడం సులభం కాదు. ఒక్కోసారి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్డేట్ అటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. భద్రత పరంగానూ బయోమెట్రిక్ సురక్షితమైనది. మీరు తప్ప దానిని ఎవరూ యాక్సెస్ చేయలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




