Bank News Alert: ఆధార్ ఓటీపీ ఆధారిత UPI చెల్లింపులకు బ్యాంకులు గ్రీన్ సిగ్నల్.. దీనిని ఎలా వినియోగించోవాలంటే..
Bank News Alert: డెబిట్ కార్డుకు(Debit Card) బదులుగా ఆధార్ ఓటీపీని వినియోగించి యూపీఐ డిజిటల్ చెల్లింపులు చేసేందుకు కొత్త వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఎన్పీసీఐ(NPCI) దీనిని 2021లో ప్రవేశపెట్టింది.
Bank News Alert: డెబిట్ కార్డుకు(Debit Card) బదులుగా ఆధార్ ఓటీపీని వినియోగించి యూపీఐ డిజిటల్ చెల్లింపులు చేసేందుకు కొత్త వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఎన్పీసీఐ(NPCI) దీనిని 2021లో ప్రవేశపెట్టింది. కానీ.. కొత్తాగా వస్తున్న ఈ చెల్లింపుల వెసులుబాటులో డెబిట్ కార్డు యాక్టివేషన్ చేయని వారు సైతం డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు NPCI, AADHAAR కలిసి పనిచేయనున్నాయి. బ్యాంక్ కస్టమర్లు యూపీఐ ప్రారంభ సమయంలో డెబిట్ కార్డు వివరాలకు బదులుగా తమ ఆధార్ ఓటీపీని వినియోగించి లాగిన్ అవ్వవచ్చని ఎన్పీసీఐ పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కొన్ని సాంకేతికత పూర్తిగా సిద్ధం కానందున కంప్లయెన్స్ టైమ్ లైన్ ను మార్చి 15, 2022కు పొడిగించినట్లు వెల్లడించింది.
ఈ ఫీచర్ ఆధార్ కార్డు లింక్ అయిన మెుబైల్ నంబర్ పై మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం బ్యాంక్ వద్ద కూడా ఆధార్ లింక్ కలిగిన నెంబరును ఇవ్వవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా బ్యాంకులు ఇప్పటికీ డెబిట్ కార్డును వినియోగించి యూపీఐ సేవలు ప్రారంభించే విధానాన్నే ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. చాలా మంది జన్ ధన్ ఖాతా దారులు ఇంతవరకు తమ రూపే డెబిట్ కార్డులను యాక్టివేట్ చేసుకోలేదని బ్యాంకులు తెలిపిన వివరాలు చెబుతున్నాయి. తాజాగా ఫీచర్ ఫోన్లు వినియోగించే వారు సైతం డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా UPI 123PAY ని ఈ నెల 8న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అందుబాటులోకి తెచ్చారు.
ఇవీ చదవండి..
Crypto Fraud: హైదరాబాదీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ.. క్రిప్టో పెట్టుబడుల పేరుతో దోచేశారు..
Market News: నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా తిరిగి లాభాల్లోకి..