ECLGS Scheme: చిన్న వ్యాపారులకు కేంద్రం ఉపశమనం.. ఆక్సిజన్ ఫ్లాంట్లకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు

కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు దెబ్బతిని బ్యాంకుల‌కు రుణాలు చెల్లించ‌లేని చిన్న వ్యాపారుల‌కు కేంద్ర ప్రభుత్వం తీపి క‌బురందించింది.

ECLGS Scheme: చిన్న వ్యాపారులకు కేంద్రం ఉపశమనం.. ఆక్సిజన్ ఫ్లాంట్లకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు
Union Govt. Expands Emergency Credit Line Guarantee Scheme
Follow us
Balaraju Goud

|

Updated on: May 31, 2021 | 5:47 PM

Union Govt. Expands Emergency Credit Line Guarantee Scheme: కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు దెబ్బతిని బ్యాంకుల‌కు రుణాలు చెల్లించ‌లేని చిన్న వ్యాపారుల‌కు కేంద్ర ప్రభుత్వం తీపి క‌బురందించింది. వారికి ది ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్‌జీఎఎస్‌) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఆక్సిజన్ ఫ్లాంట్లను నెలకొల్పే ఆసుపత్రులకు విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది.

ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టిన‌ప్పటి నుంచి నాలుగుసార్లు కేంద్రం విస్తరించింది. క‌నుక దీన్ని ఈసీఎల్జీఎస్ 4.0గా ఆర్థిక శాఖ అధికారులు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇప్పటివ‌ర‌కు ఈ ప‌థ‌కంలో ఉన్న రూ.500 కోట్ల రుణ ప‌రిమితిని కూడా తొల‌గించింది. వ్యాపారులు తాము బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో 40 శాతం గానీ, రూ.200 కోట్లు అద‌నంగా గానీ తీసుకోవ‌చ్చు. ఈసీఎల్జీఎస్ 1.0 అర్హులైన వారు మ‌రో 10 శాతం రుణం తీసుకునే వెసులుబాటు కేంద్రం క‌ల్పించింది.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఆసుపత్రులు, న‌ర్సింగ్ హోంల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవ‌డానికి, ఎంఎస్ఎంఈ రుణాల పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌, పౌర విమాన‌యాన శాఖ‌ల‌కు ఈ ప‌థ‌కాన్ని విస్తరించింది. అంతే కాదు.. ఈ స్కీం గ‌డువు సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పొడిగించింది. ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు ఆసుపత్రులు తీసుకునే రూ.2 కోట్ల రుణాల వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంది. ఈ రుణాల‌పై వ‌డ్డీ 7.5 శాతం లోపే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.

Read Also… కరోనా చికిత్సకు రూ. 5 లక్షల పర్సనల్ లోన్.. ఏయే బ్యాంకులు ఇస్తున్నాయి.? ఎలా పొందాలంటే.!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?