Saving Schemes: పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ జారీ..

Saving Schemes: పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా పాపులర్ అయిన.. నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​(NSC), పబ్లిక్​ ప్రొవిడెంట్​ ఫండ్​(PPF)​ సహా మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లపై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

Saving Schemes: పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ జారీ..
Small saving Schemes
Follow us

|

Updated on: Apr 01, 2022 | 7:25 AM

Saving Schemes: పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా పాపులర్ అయిన.. నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​(NSC), పబ్లిక్​ ప్రొవిడెంట్​ ఫండ్​(PPF)​ సహా మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని తెలిపింది. 2020-21 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం నుంచి వీటిపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవటం గమనార్హం. తాజా నిర్ణయంతో పీపీఎఫ్​, ఎన్​ఎస్​సీలపై తొలి త్రైమాసికంలో వడ్డీ రేటు వరుసగా 7.1శాతం, 6.8 శాతంగా కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

“2022, ఏప్రిల్​ 1న మొదలై.. 2022, జూన్​ 30న ముగియనున్న తొలి త్రైమాసికానికి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్నవే కొనసాగుతాయి. 2021-22 ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో అమలవుతున్న వడ్డీ రేట్లే ఇప్పుడూ వర్తిస్తాయి.” – కేంద్ర ఆర్థిక శాఖ

కేంద్రం తీసకున్న తాజా నిర్ణయంతో పొదుపుదారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గిస్తారని అందరూ ఆందోళన చెందినప్పటికీ చివరికి కేంద్రం అనూహ్యంగా రేట్లను అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ కారణంగా దేశంలోని వివిధ పథకాల్లో అందుతున్న వడ్డీ రేట్లు, వాటి చెల్లింపుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇలా ఉన్నాయి.

వివిధ పథకాల వడ్డీ రేట్లు..

పథకం వడ్డీ రేటు% వడ్డీ జమ/చెల్లింపు వ్యవధి
పీపీఎఫ్ 7.1 ఏడాదికోసారి
ఎన్​ఎస్​సీ 6.8 ఏడాదికోసారి
ఏడాది టర్మ్​ డిపాజిట్​ 5.5 మూడు నెలలకోసారి
సుకన్య సమృద్ధి యోజన 7.6 మూడు నెలలకోసారి
ఐదేళ్ల వయోవృద్ధుల పొదుపు పథకం 7.4 మూడు నెలలకోసారి
పొదుపు ఖాతాలపై 4 ఏడాదికోసారి
1-5 ఏళ్ల టర్మ్​ డిపాజిట్లు 5.6-6.7 మూడునెలలకోసారి
ఐదేళ్ల రికరింగ్​ డిపాజిట్లు 5.8 మూడు నెలలకోసారి

ఇవీ చదవండి..

Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులోకి..

Airtel Tech Mahindra: చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా.. 5జీ సేవలతో పాటు..

Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర