Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులోకి..

Google Pay: దేశంలో డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించే ప్లాట్‌ఫాం గూగుల్‌ పే తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ను తెలిపింది. సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.

Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులోకి..
Google Pay
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 01, 2022 | 6:39 AM

Google Pay: దేశంలో డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించే ప్లాట్‌ఫాం గూగుల్‌ పే తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ను తెలిపింది. సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘ట్యాప్‌ టూ పే’(Tap to pay) సేవలను యూజర్లకు చేరువచేసింది. యూపీఐ సేవల్లో భాగంగా వినియోగదారులకు ‘ట్యాప్ టు పే’ ఫీచర్‌ కోసం ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్‌ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతినిస్తోంది. ఈ ఫీచర్ కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పైన్ ల్యాబ్స్(Pined Labs) రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్‌ టెర్మినల్‌ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్‌ పే యూజర్లు చేయవచ్చు.

నీయర్‌ టూ ఫీల్డ్‌(NFC) పేమెంట్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారుల వద్ద అందుబాటులో ఉంది. ట్యాప్‌ టూ పే ఫీచర్‌తో యూపీఐ పేమెంట్స్‌ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్‌ పే బిజినెస్‌ హెడ్‌ సశిత్‌ శివానందన్‌ వెల్లడించారు. అంతేకాక అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్‌ పేతో భాగస్వామిగా పైన్‌ ల్యాబ్స్‌ ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు పైన్‌ ల్యాబ్స్‌ బిజినెస్‌ చీఫ్‌ ఖుష్‌ మెహ్రా వ్యాఖ్యానించారు. భారత్‌లో కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ను అందించేందుకు పైన్‌ ల్యాబ్స్‌ కృషి చేస్తోందని ఆయన అన్నారు.

ఇవీ చదవండి..

Paytm Offer: పేటీఎం బంపర్ ఆఫర్.. డబ్బులు చెల్లించకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..