Gold Silver Price Today: గుడ్‌న్యూస్‌.. నిలకడగా బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర..!

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం, వెండి విషయానికొస్తే భారతీయులు..

Gold Silver Price Today: గుడ్‌న్యూస్‌.. నిలకడగా బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర..!
Gold Price Today
Follow us

|

Updated on: Apr 01, 2022 | 10:39 AM

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం, వెండి విషయానికొస్తే భారతీయులు (Indians) పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గురువారం (ఏప్రిల్‌ 1)న దేశం (India)లో బంగారం (Gold) ధరలు స్థిరంగా కొనసాగుతుడగా, వెండి (Silver) ధరలు మాత్రం దిగి వచ్చింది. దేశీయంగా వెండి ధరలు ఏకంగా రూ.5వేలకుపైగా దిగివచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,930, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,290, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,980 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,9700 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980 ఉంది.

వెండి ధరలు

దేశీయం బంగారం ధరల నిలకడగా ఉండగా, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. దేశీయంగా రూ.800 నుంచి రూ.5,300 వరకు తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.68,800 ఉండగా, ముంబైలో రూ.66,800 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,800 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

IRCTC: సమ్మర్‌ టూర్‌ ప్యాకేజీ.. హైదరాబాద్‌ నుంచి ప్రారంభం.. టికెట్‌ ధర.. ఇతర వివరాలు..!

Ratan Tata: అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. రతన్ టాటాకు భారతరత్న ఇవాలన్న పిటిషన్ కొట్టివేత