- Telugu News Trending Paytm Bumper Offer Paytm users can book train tickets on IRCTC now and pay later
Paytm Offer: పేటీఎం బంపర్ ఆఫర్.. డబ్బులు చెల్లించకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..
Indian Railways: పేటీఎం వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్త. ఇప్పుడు మీ వద్ద డబ్బు లేకపోయినా.. మీరు ట్రైన్‌లో ప్రయాణించవచ్చు. డబ్బులు చెల్లించకుండానే టికెట్ కొనుగోలు చేయొచ్చు. అవును మీరు విన్నది నిజంగా నిజం. పేటీఎం తన వినియోగదారుల కోసం అదిరిపోయే స్కీమ్ తీసుకువచ్చింది. ‘Book Now Pay Later’ అంటూ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం.. ఐఆర్‌సీటీసీ టికెటింగ్ సర్వీస్‌లో టికెట్ బుక్ చేసుకునే పేటీఎం వినియోగదారులు.. తమ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినప్పటికీ.. టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్.. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని.. ఆ తరువాత డబ్బులు చెల్లించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ స్కీమ్ రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి అద్భుత అవకాశంగా చెప్పొచ్చు.
Updated on: Apr 01, 2022 | 6:30 AM

Buy Now, Pay Later ఆఫర్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన వస్తోందని పేటీఎం యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వారి ఆర్థిక అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో కేవలం రైలు టిక్కెట్లను బుక్ చేయడమే కాకుండా.. యుటిలిటీ బిల్లులు చెల్లించడం, షాపింగ్ చేయడం, వినియోగదారులు రిటైల్ అవుట్‌లెట్‌లు, ఆన్‌లైన్ షాపింగ్ లలో కొనుగోళ్లు కూడా చేయొచ్చు అని తెలిపింది. సౌకర్యం కోసం ఈఎంఐ చెల్లింపుల అవకాశం కూడా ఉందని తెలిపింది.

Paytm పోస్ట్‌పెయిడ్ గరిష్టంగా 30 రోజుల వ్యవధికి రూ. 60,000 వరకు వడ్డీ రహిత క్రెడిట్‌ను అందిస్తుంది. వినియోగదారులు వారి క్రెడిట్-ఆధారిత ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి నెలవారీ బిల్లును అందిస్తారు. IRCTC ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు Paytm పోస్ట్‌పెయిడ్ (BNPL) అందుబాటులో ఉంటుంది.

Paytm పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ CEO ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ.. “IRCTCతో భాగస్వామ్యం ద్వారా, పేటీఎం పేమెంట్స్ గేట్‌వే(Paytm Payment Gateway) వినియోగదారులకు తత్కాల్ టికెట్ బుకింగ్‌ల కోసం తర్వాత చెల్లించే ఆప్షన్‌తో సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను అందించాలని భావిస్తోంది.’’ అని అన్నారు.

ఈ BNPL ప్రయోజనాన్ని పొందాలంటే IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లాల్సి ఉంటుంది. మీ ప్రయాణ వివరాలను నమోదు చేసి, చెల్లింపు విభాగంలో 'తర్వాత చెల్లించండి' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌పై క్లిక్ చేయండి. పేటీఎం వివరాలను ఉపయోగించి లాగిన్ చేయండి. OTPని నమోదు చేయండి. అలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్వే ప్లాట్‌ఫారమ్, రిజర్వ్ చేయని రైలు టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు. డిజిటల్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి Paytm IRCTCతో ఒప్పందం చేసుకుంది. రైల్వే స్టేషన్లలోని ATMలలో Paytm QR ద్వారా కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకులు Paytmని ఉపయోగించి కొన్ని ప్రాథమిక టిక్కెట్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ రైలు ప్యాసింజర్ టిక్కెట్‌లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి, వారి సీజనల్ టిక్కెట్‌లను పునరుద్ధరించుకోవడానికి, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌లలో (ATVMs) స్మార్ట్ కార్డ్‌లను రీఛార్జ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.