Budget 2023 – Sensex: బడ్జెట్ ప్రసంగం వేళ సెన్సెక్స్‌ దూకుడు.. చివరకు ఏం జరిగిందంటే..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Feb 01, 2023 | 5:14 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బడ్జెట్ రోజున మార్కెట్లు పుంజుకున్నాయి.

Budget 2023 - Sensex: బడ్జెట్ ప్రసంగం వేళ సెన్సెక్స్‌ దూకుడు.. చివరకు ఏం జరిగిందంటే..
Stock Market 2023

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులతోపాటు పలు విషయాల్లో ఊరటనివ్వడంతో బడ్జెట్ రోజున మార్కెట్లు పుంజుకున్నాయి. గత వారం వరకు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగగా.. తాజాగా బడ్జెట్.. సెన్సెక్స్ కు కొత్త ఊపిరినిచ్చింది. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భలో సెన్సెక్స్ 1,180 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 50 దాదాపు 300 పాయింట్ల మేర పెరిగింది. అయితే, చివరకు అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్‌పై ఎన్నో ఆశలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు.. బడ్జెట్‌ ప్రసంగం జరుగుతున్నంత సమయంలో అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా లాభలో బాటలో పయనించింది. ఆదాయ పన్ను విధానంలో మార్పులు, మూలధన పెట్టుబడులకు కేటాయింపులు పెంచడం మదుపర్లను ఉత్సాహన్నివ్వడంతో మార్కెట్ కళకళలాడింది. అయితే, ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు చివరకు కిందకు దిగొచ్చాయి.

ఉదయం సెన్సెక్స్‌ 60,001.17 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,773.44- 58,816.84 మధ్య కదలాడింది. చివరకు 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 దగ్గర స్థిరపడింది.

నిఫ్టీ 17,811.60 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,972.20- 17,353.40 మధ్య ట్రేడయింది. చివరకు 45.85 పాయింట్ల నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.88 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

నిఫ్టీ 50లో ఐసిఐసిఐ బ్యాంక్, కన్స్ట్రక్షన్ బెహెమోత్ ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్, ఐటిసి టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

గత ఏడాది ₹7.5 లక్షల కోట్ల నుంచి పెట్టుబడి వ్యయం ₹10 లక్షల కోట్లకు పెరగడం మొత్తం ఆర్థిక వ్యవస్థకు పెద్ద సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, గత నెల మొత్తం అస్థిరతను ఎదుర్కొన్న తర్వాత సెన్సెక్స్ 60,000 మార్కును తిరిగి పొందడం పట్ల విశ్లేషకులు శుభపరిణామమని పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదన ప్రకారం.. FY2023- 2024 కోసం ₹10 లక్షల కోట్ల మూలధన వ్యయం లేఅవుట్‌ను ప్రకటించింది. ఇది గత సంవత్సరం ₹7.5 లక్షల కోట్లుగానే ఉంది. అయితే.. “సమ్మిళిత వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, యూనియన్ బడ్జెట్ మౌలిక సదుపాయాలు, వ్యవసాయంపై వ్యయాలను పెంచింది. ఇది మా దృష్టిలో ఆర్థిక వ్యవస్థపై శక్తి గుణకార ప్రభావాన్ని చూపుతుంది” అని LKP సెక్యూరిటీస్ పరిశోధనా విభాగాధిపతి ఎస్ రంగనాథన్ అన్నారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu