Aadhaar: మీ ఆధార్‌ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూఐడీఏఐ ఏం చెబుతోంది

ఆధార్‌ను ఆసరాగా చేసుకునే ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌ను ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీనివల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)హెచ్చరిస్తుంది. ఆధార్ ఫోటోకాపీని తెలివిగా ఉపయోగించాలని సూచించింది. మరి ఆధార్‌ను ఎక్కడ..

Aadhaar: మీ ఆధార్‌ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యూఐడీఏఐ ఏం చెబుతోంది
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Feb 20, 2024 | 5:53 PM

Aadhaar: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఏ చిన్న పని కావాలన్నా ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్‌ కార్డు వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆధార్‌ను ఆసరాగా చేసుకునే ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌ను ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీనివల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)హెచ్చరిస్తుంది. ఆధార్ ఫోటోకాపీని తెలివిగా ఉపయోగించాలని సూచించింది. మరి ఆధార్‌ను ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వకూడదో యూఐడీఏఐ కొన్ని విషయాల గురించి ప్రస్తావించింది. అవేంటో తెలుసుకుందాం.

హోటల్‌, సినిమా హాలు, జిమ్‌లకు వెళ్లి గుర్తింపు కార్డు అడిగితే అక్కడ ఆధార్‌ ఇవ్వకూడదని సూచిస్తోంది యూఐడీఏఐ. ఇంటి చిరునామా ఆధార్ కార్డులో ఉండటం వల్ల చాలా చోట్ల గుర్తింపు, నివాస ధ్రువీకరణ కోసం ఆధార్‌ను అడుగుతారు. కానీ ఈ పరిస్థితిలో ఆధార్ ఇవ్వకుండా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ ఇవ్వవచ్చు. ప్రైవేట్‌ సంస్థల్లో ఆధార్‌ అడిగితే దానికి బదులుగా మరో ఐడీ చూపించవచ్చు. ఒకవేళ మీరు ఆధార్‌ ఇవ్వవలసి వస్తే దాని స్థానంలో మాస్క్‌ ఆధార్ ఫోటోకాపీని ఇవ్వవచ్చు. మాస్క్‌ ఆధార్‌ అంటే ఆధార్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దుర్వినియోగం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో..

ఇవి కూడా చదవండి

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆధార్ అవసరం లేదు. కేవైసీ కోసం పాన్‌కార్డ్‌ని సమర్పించవచ్చు. అయితేప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతాలో ఆధార్‌ను నమోదు చేయడం తప్పనిసరి. రుణం తీసుకోవడానికి కూడా ఆధార్ తప్పనిసరి కాదు. అయితే KYC డాక్యుమెంట్లలో ఆధార్‌ను ఉపయోగించవచ్చు. మీరు మీ పూర్తి ఆధార్ నంబర్‌ను ఇవ్వకుండా మాస్క్‌ ఆధార్‌ కాపీని ఉపయోగించవచ్చు. మీరు eKYCలో ఆధార్ ఇస్తున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి. పూర్తి ఆధార్ నంబర్ ఇవ్వడానికి బదులుగా, మీరు మాస్డ్క్‌ ఆధార్ కాపీని ఇవ్వొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి