AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Car: మీరు ఎలక్ట్రిక్‌ కారు కొంటున్నారా? ఈ సందేహాలను సమాధానం తెలుసుకోండి!

వాహనదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు చాలామందిలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వాహనం తీసుకునే ముందు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి..

Electric Car: మీరు ఎలక్ట్రిక్‌ కారు కొంటున్నారా? ఈ సందేహాలను సమాధానం తెలుసుకోండి!
Electric Car
Subhash Goud
|

Updated on: Feb 20, 2024 | 5:01 PM

Share

Electric Car: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో వాహనాల తయారీదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు కన్నేశారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కార్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వాహనదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు చాలామందిలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వాహనం తీసుకునే ముందు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గుడ్డిగా ఎలాంటి వివరాలు తెలుసుకోకుండా కార్లను తీసుకుంటే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ కారు రేంజ్, బ్యాటరీ, భద్రతకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  1. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితం..?: ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ప్రవేశించే ముందు అనేక దశల పరీక్షలను ఎదుర్కొవాల్సి వస్తుంటుంది. అందువల్ల పెట్రోల్, డీజిల్‌తో నడిచే కారులాగానే ఎలక్ట్రిక్ కార్లకు కూడా పలు పరీక్షలు నిర్వహిస్తుంటంది కంపెనీ. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ కారులో ఇంధనానికి సంబంధింఇన ట్యాంక్ ఉండదు కాబట్టి ఇది ఇతర కార్ల కంటే సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
  2. ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌తో ఎంతదూరం నడుస్తుంది?: ఎలక్ట్రిక్‌ కారు ఒకసారి ఛార్జీ చేస్తే సుమారు 180 కి.మీ నుంచి 450 కి.మీల పరిధిని ప్రయాణించగలదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కారు మోడల్‌ను బట్టి ఉంటుంది. అన్ని కార్లు ఒకేలా మైలేజీ ఇవ్వవు.
  3. చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి?: ఎలక్ట్రిక్ కారు ఎందుకు ఎక్కువ ఖరీదు ఉంటాయి?: ఈవీ కారు ఖరీదైనదిగా ఉండటానికి ప్రధాన కారణం దాని బ్యాటరీ. ఈ కారుకు బ్యాటరీయే కీలకం. బ్యాటరీ మన్నికను బట్టి ఉంటుంది. ఇందులో ఉండే బ్యాటరీలు ధరలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే కొంత ధర ఎక్కువగానే ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పెద్దగా పోటీ లేదు. అయితే పెరుగుతున్న పోటీ వల్ల ఎలక్ట్రిక్ కార్ల సాంకేతికత కూడా చౌకగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  4. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? : ముఖ్యంగా ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ కీలక పాత్ర పోషిస్తుంది. అధిక శక్తి ఉండే బ్యాటరీలు ఉండటం ముఖ్యం. బ్యాటరీ శక్తిని బట్టి మైలేజీ ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 సంవత్సరాల పాటు మంచి పనితీరును కలిగి ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు కారు, బ్యాటరీ వినియోగం బట్టి ఆధారపడి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈవీ కార్లు పర్యావరణ అనుకూలమైనవేనా?: ఎలక్ట్రిక్ కారును పెట్రోల్, డీజిల్‌తో నడిచే కారుతో పోల్చినట్లయితే పర్యావరణ అనుకూలమైనదని చెప్పవచ్చు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు చాలా కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లు ఇంధనం లేకుండా నడుస్తాయి కాబట్టి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి