Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile: మీ ఫోన్ చోరీకి గురైతే వెంటనే ఈ 3 పనులు చేయండి.. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

చాలా మంది తమ ఫోన్‌లను పోగొట్టుకోవడమే.. లేదా చోరీకి గురవడమో జరుగుతుంటుంది. అలాంటి సమయంలో టెన్షన్‌కు గురవుతుంటాము. అయితే, మీ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా పోయినా వెంటనే కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ అవుతుంది. నేటి కాలంలో మొబైల్‌లు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అనేక ఇతర ఆర్థిక సేవలకు ఉపయోగకరంగా..

Mobile: మీ ఫోన్ చోరీకి గురైతే వెంటనే ఈ 3 పనులు చేయండి.. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
Smartphone
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2024 | 8:46 PM

నేడు మొబైల్ ఫోన్ లేకుండా ఏ పనీ చేయడం అసాధ్యం. ఎక్కడ చూసినా మొబైల్స్ వాడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫోన్‌లను వాడుతున్నారు. చాలా మంది తమ ఫోన్‌లను పోగొట్టుకోవడమే.. లేదా చోరీకి గురవడమో జరుగుతుంటుంది. అలాంటి సమయంలో టెన్షన్‌కు గురవుతుంటాము. అయితే, మీ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా పోయినా వెంటనే కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ అవుతుంది. నేటి కాలంలో మొబైల్‌లు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అనేక ఇతర ఆర్థిక సేవలకు ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో తమ మొబైల్ చోరీకి గురైతే తమ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని ప్రజలు భయపడుతుంటారు. మీ మొబైల్ దొంగిలించబడినట్లయితే, వెంటనే ఈ మూడు పనులు చేయండి.

మీ ఫోన్ దొంగిలించబడినట్లయితే, వెంటనే ఈ 3 పనులు చేయండి

  • మీ SIM కార్డ్‌ని బ్లాక్ చేయండి : ముందుగా, మీ SIM కార్డ్‌ని వెంటనే బ్లాక్ చేయండి. దీని కోసం మీరు మీ టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు లేదా 14422 నంబర్‌కు డయల్ చేయవచ్చు.
  • FIR నమోదు చేయండి : సమీప పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయండి. FIRలో ఫోన్ IMEI నంబర్, ఇతర సమాచారాన్ని అందించండి.
  • మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసి, డేటాను క్లియర్ చేయండి: మీ ఫోన్‌లో ‘Find My Device’ లేదా ‘Find My Phone’ ఫీచర్‌ను ఆన్ చేయబడి ఉంటే, మీరు మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడానికి, మీ డేటాను డిలీట్‌ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

ఈ చిట్కాలను కూడా పాటించండి

ఇవి కూడా చదవండి
  • మీ ఫోన్ IMEI నంబర్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ముందుగానే నోట్‌ చేసుకోండి.
  • మీ ఫోన్‌లో “ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌ను ఆన్ చేయండి.
  • పాస్‌వర్డ్ లేదా పిన్‌తో మీ ఫోన్‌ను రక్షించండి.
  • ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఫోన్‌ను దొంగతనం జరిగినా మీ వ్యక్తిగత వివరాలు వారికి తెలియకుండా రక్షించుకోవచ్చు. అలాగే దొంగిలించిన మీ ఫోన్‌ను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి