Health Insurance: హెల్త్ పాలసీ ప్రీమియంను EMIలో కడుతున్నారా? అయితే మీ జేబుకు నష్టమే!

బీమా కంపెనీలు చెల్లింపు గడువు తేదీ తర్వాత 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీ లాప్స్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ సమయంలో మీరు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే బీమా కంపెనీ మీ క్లెయిమ్ ను తిరస్కరించవచ్చు. ఇందులో మరో సమస్యా ఉంది. అదేంటో ఓ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు 4 నెలల ప్రీమియంలు..

Health Insurance: హెల్త్ పాలసీ ప్రీమియంను EMIలో కడుతున్నారా? అయితే మీ జేబుకు నష్టమే!
Health Insurance
Follow us

|

Updated on: Feb 19, 2024 | 6:48 PM

ఈ రోజుల్లో చాలా మంది బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ప్రీమియం చెల్లించేటప్పుడు నెలవారీ ప్రీమియం అనుకూలంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. బీమా డిస్ట్రిబ్యూటర్ అయిన PolicyBazaar రిపోర్ట్ ప్రకారం.. 33% మంది 26 – 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఆరోగ్య బీమాను మొదటిసారి కొనుగోలు చేసేటప్పుడు నెలవారీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నారని తెలిపింది.

టైర్-3 నగరాల్లో ఈ ట్రెండ్ బాగా ఫేమస్ అయ్యింది. ఈ వయస్సులో 44% మంది వ్యక్తులు నెలవారీ చెల్లింపుల ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్నారు. టైర్-2 నగరాల్లో, ఈ సంఖ్య 31%. మెట్రో నగరాల్లో ఇది 23%. పెరుగుతున్న జనాదరణను బట్టి చూస్తే.. వార్షిక ప్రీమియం చెల్లింపు కంటే నెలవారీ చెల్లింపు విధానం మెరుగ్గా ఉంది అని అర్థమా?

నిజానికి, ఈ రోజుల్లో ఆరోగ్య బీమా కంపెనీలు నెలవారీ, క్వార్టర్లీ ప్రీమియం చెల్లింపు విధానాలను బాగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోగ్య ప్రణాళికలను అందరికీ చేరువ చేయడమే వీటి లక్ష్యం. రెండు చెల్లింపు ఆప్షన్స్ ను సులభంగా అనిపించినా.. వీటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ చెల్లింపు విధానాలు ఎంత అనుకూలంగా, ప్రయోజనకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఇందులో ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం.

ఇవి కూడా చదవండి

ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఎక్స్ పర్ట్.. బల్వంత్ జైన్ అయితే.. ఇది అంత మంచిది కాదని చెప్పారు. దీనిలో అనేక లోపాలు ఉన్నాయి. మీరు ఏదైనా నెల ప్రీమియం చెల్లించడంలో విఫలమైతే, పాలసీ లాప్స్ అవుతుంది. మీరు ఆటో పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకున్నా మీ అకౌంట్ లో తగినంత నిధులు లేకపోయినా మీరు చెల్లింపును చేయలేరు. ఇది పాలసీ లోపాలకు దారితీయడమే కాకుండా మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. పాలసీ గడువు ముగిసిన తర్వాత, మీరు ఆ పాలసీ ప్రయోజనాలను కోల్పోయి కొత్త పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నెలవారీ లేదా క్వార్టర్లీ ఇన్ స్టాల్ మెంట్స్ లో .. ప్రీమియం చెల్లించడం సౌకర్యంగా ఉండొచ్చు. కానీ, వార్షిక చెల్లింపు కంటే.. ఈ విధానంలో మొత్తం ప్రీమియం 3 నుండి 4% ఎక్కువగా ఉండవచ్చు.

అయితే బీమా కంపెనీలు చెల్లింపు గడువు తేదీ తర్వాత 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత పాలసీ లాప్స్ అవుతుంది. గ్రేస్ పీరియడ్ సమయంలో మీరు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే బీమా కంపెనీ మీ క్లెయిమ్ ను తిరస్కరించవచ్చు. ఇందులో మరో సమస్యా ఉంది. అదేంటో ఓ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు 4 నెలల ప్రీమియంలు చెల్లించి.. 5వ నెలలో ఆసుపత్రి పాలయ్యారని అనుకుందాం. మీ క్లెయిమ్‌ను పరిష్కరించే ముందు బీమా కంపెనీ ఏం చేస్తుందంటే.. మీ క్లెయిమ్ మొత్తం నుంచి.. మీరింకా చెల్లించాల్సిన 8 నెలల ప్రీమియంను తీసేస్తుంది. ఆ తరువాతే నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ ను ఆమోదిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో.. మీ క్లెయిమ్ మొత్తం.. మీరు చెల్లించిన మొత్తం ప్రీమియం కంటే తక్కువగా ఉంటే.. ఆ క్లెయిమ్ సెటిల్ అయ్యేలోపు మీరు మీ ఆ ప్రీమియంను పే చేయాలి. మనీ రూపంలో దీన్ని అర్థం చేసుకుందాం. మీ నెలవారీ ప్రీమియం రూ.1,000 అనుకుందాం.. నాలుగు నెలల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత మీరు రూ. 30,000 క్లెయిమ్ చేస్తారు. బీమా కంపెనీ.. ఆ సంవత్సరానికి ఉన్న బ్యాలెన్స్ ప్రీమియం అయిన రూ. 8000 తీసివేసి, రూ. 22,000 బ్యాలెన్స్ ను పే చేస్తుంది.

ఇంకా, ప్రతి EMI లావాదేవీకి.. అంటే, నెలవారీ ప్రీమియం చెల్లింపుతోపాటు ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవచ్చు. అందువల్ల, సౌలభ్యం కోసమో, కేవలం నెలవారీ లేదా క్వార్టర్లీ చెల్లింపు ఆప్షన్ ను ఎంచుకోవద్దు. దీనికి బదులుగా, మీ సొంత లాభనష్టాలను పరిగణనలోకి తీసుకొని వార్షిక ప్రీమియం పేమెంట్ ఆప్షన్ తో పోల్చి చూడండి. మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత.. మీకు బాగా సరిపోయే పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు