Provident fund: మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందా? వెంటనే చెక్ చేసుకోండి!
ఉద్యోగుల భవిష్యత్తు, ఆర్థిక భద్రత కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతాను ప్రారంభిస్తారు. జీతం నుంచి నిర్ణీత మొత్తం పెన్షన్ కింద జమ చేసి ప్రతి నెలా ఈ ఖాతాలో చేరుస్తారు. అయితే ఇందులో ఉద్యోగితో పాటు సంస్థ కూడా జీతంలో 12 శాతం జమ చేస్తుంది. ఇది తమ పీఎఫ్ ఖాతాలో జమ అయిందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నెలవారీ జీతం నుంచి 12 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉద్యోగి పని చేసే సంస్థ నుంచి కూడా అతని జీతంలో 12 శాతం తీసుకుంటుంది. అంటే ఉద్యోగి ఖాతా నుంచే కాకుండా కంపెనీలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. ఉద్యోగులు తమ అవసరాల కోసం ఎప్పుడైనా ఈ డబ్బును ఉపసంహరించుకోవచ్చు, ఇది ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఈ స్కీమ్‌కు జమ చేస్తారు. ఒక వేళ ఉద్యోగి తన పని జీవితంలో ఈ డబ్బును డ్రా చేయకపోతే, పదవీ విరమణ తర్వాత పెన్షన్‌గా తీసుకోవచ్చు. ఈ వ్యవధిలో మొత్తం డబ్బు పీఎఫ్ ఖాతాకు జమ చేయడమే కాకుండా దానిపై వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
పీఎఫ్ మొత్తంపై ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది
ప్రతినెలా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అవుతుండగా, ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది. దీని ప్రకారం ఈపీఎఫ్‌వో ప్రస్తుతం 8.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు ఏడాదికి ఒకసారి చెల్లిస్తుండగా, 2024 సంవత్సరానికి వడ్డీ చెల్లించినట్లు సమాచారం. కాబట్టి, పీఎఫ్ ఖాతాలో వడ్డీ వచ్చిందో లేదో తెలుసుకోవడం ఎలాగో వివరంగా చూద్దాం.
పీఎఫ్ వడ్డీ మొత్తాన్ని ఎలా తనిఖీ చేయాలి?
పీఎఫ్ వినియోగదారులకు సులభమైన అనేక రకాల సేవలను ప్రభుత్వం అందిస్తుంది. బ్యాలెన్స్, వడ్డీని ఎప్పటికి అప్పుడు చెక్ చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలను అందిస్తుంది. ఆన్‌లైన్ సేవలను ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయవచ్చు. మీరు ఆఫ్‌లైన్‌లో తెలుసుకోవాలనుకుంటే ఈపీఎఫ్‌వో అధికారిక నంబర్‌ను సంప్రదించవచ్చు.
ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో ఇలా అప్లై చేయాలి
- ముందుగా మీరు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అందులో ఎంప్లాయీస్ కేటగిరీని ఎంచుకోవాలి.
- అందులో మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- ఇప్పుడు మెంబర్ పాస్‌బుక్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆ పాస్‌బుక్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉంది, నెలనెలా డబ్బులు సరిగ్గా జమ అవుతున్నాయా? వడ్డీ పెరిగిందా? అనే విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు.
వీటిని గుర్తుంచుకోవాలి..
అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగానూ పీఎఫ్ డబ్బులు పొందవచ్చు. కానీ ఈ విధంగా చేస్తే పెన్షన్ మొత్తం తగ్గుతుంది. అత్యవసరమైతే తప్ప తీసుకోకుంటే పెన్షన్ మొత్తం అలాగే ఉంటుంది. ఇది మనం రిటైర్ అయిన తర్వాత ప్రతి నెలా పెన్షన్‌గా వస్తుంది. చాలా మంది ఇదేమీ పట్టించుకోకుండా అవసరమైనప్పుడు పూర్తిగా విత్‌డ్రా చేస్తున్నారు. పీఫ్ సొమ్మును విత్‌డ్రా చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.