FDs interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ.. ఆ బ్యాంకుల్లో అదిరే ఆఫర్

మన దేశంలోని సురక్షిత పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ల (ఎఫ్ డీ)దే అగ్రస్థానం. వివిధ బ్యాంకులు అందించే వీటికి ప్రజల ఆదరణ చాాలా బాగుంటుంది. చదువు, పెళ్లి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వీటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు.

FDs interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ.. ఆ బ్యాంకుల్లో అదిరే ఆఫర్
Cash
Follow us
Srinu

|

Updated on: Dec 22, 2024 | 8:05 PM

మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత కాలానికి అసలుతో కలిసి వడ్డీ తీసుకునే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే అన్ని బ్యాంకులు ఎఫ్ డీలపై ఒకే రకమైన వడ్డీరేట్లు అమలు చేయవు. కాబట్టి వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను గమనించి, ఎక్కువ వచ్చేచోట డబ్బులను పెట్టుబడి పెట్టాలి. ఈ నేపథ్యంలో అత్యధికంగా 9 శాతం వడ్డీని అందించే బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం.

ఫెడరల్ బ్యాంకు

ఫెడరల్ బ్యాంకులో మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీరేట్లను సవరించారు. 2024 డిసెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ ప్రకారం ఏడు నుంచి 29 రోజుల వరకూ సాధారణ ఖాతాదారులకు 3, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఏడాది నుంచి 399 రోజులకు మించితే 7.25, 7.75 శాతం, 400 రోజులకు 7.35, 7.85 శాతం, మూడేళ్ల నుంచి 50 నెలల కంటే తక్కువకు 7.10, 7.60 శాతం, ఐదేళ్లకు పైబడి 6.60, 7.25 శాతం వడ్డీని అందిస్తున్నారు.

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకులో రూ.మూడు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీరేట్లు సవరించారు. 2024 డిసెంబర్ 15 నుంచి వీటిని అమలు చేస్తున్నారు. ఈ బ్యాంకులో ఏడు నుంచి 14 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3.50, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీరేటు ఇస్తున్నారు. అలాగే 241 నుంచి 364 రోజులకు 6.05, 6.55 శాతం, 365 నుంచి 452 రోజులకు 7.50, 8 శాతం, 500 రోజులకు 8, 8.50 శాతం, 60 నెలల నుంచి 120 నెలల వరకూ 7, 7.50 శాతం వడ్డీని అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కర్ణాటక బ్యాంకు

కర్టాటక బ్యాంకులో ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ నుంచి ఎఫ్ డీల వడ్డీరేట్లను మార్పుచేశారు. ఈ బ్యాంకులో రూ.మూడుకోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్టు ఇలా ఉన్నాయి. ఏడు నుంచి 45 రోజులకు 3.5 శాతం, ఏడాది నుంచి రెండేళ్లకు 7.25 శాతం, రెండు నుంచి ఐదేళ్లకు 6.50 శాం, ఐదు నుంచి పదేళ్ల లోపు డిపాజిట్లకు 5.80 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీరేట్లను సవరించారు. ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ ప్రకారం సాధారణ ఖాతాదారులకు 2.35 నుంచి 7.35 శాతం వరకూ వడ్డీరేట్లు అమలు చేస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్లకు 2.75 నుంచి 7.85 శాతం ఇస్తున్నారు.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.50 నుంచి 8.25 శాతం వరకూ, సీనియర్ సిటిజన్లకు 2.75 నుంచి 9 శాతం వరకూ వడ్డీరేట్లు ప్రకటించింది. మూడు కోట్ల రూపాయల లోపు డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి