SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది వరకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Sbi
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2024 | 6:02 PM

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది వరకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకాల కోసం నమోదు చేసుకోవడానికి బ్యాంకు రావాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు పథకాలను నమోదులో సౌలభ్యాన్ని పెంపొందించడానికి తన కస్టమర్ల కోసం మరొక ఎనేబుల్‌ను తీసుకువచ్చిందని ఎస్‌బీఐ తెలిపింది.

బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో పాలసీ లబ్ధిదారునికి ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పథకం కింద రూ. 2,00,000 మరణ కవరేజీని అందిస్తుంది. ఇది ప్యూర్-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ ప్రయోజనాన్ని అందించదు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవశాత్తు మరణం సంభవించిన సందర్భంలో లేదా వైకల్యానికి రక్షణ కల్పిస్తుంది. అయితే ఒక సంవత్సరానికి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్దరించుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 18-50 సంవత్సరాల మధ్య వయస్సు గల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులందరికీ రూ. 2 లక్షల పునరుత్పాదక ఒక సంవత్సరం జీవిత బీమాను అందిస్తుంది. ఏదైనా కారణం వల్ల మరణాన్ని కవర్ చేస్తుంది.

ఏటా రూ.436 ప్రీమియంతో పీఎం జీవన్‌ జ్యోతి

ఇవి కూడా చదవండి

2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాలి. అంటే నెలవారీగా చూస్తే.. 436/12=36.3 అంటే ఒక వ్యక్తి ప్రతి నెలా దాదాపు రూ. 36 ఆదా చేస్తే సరిపోతుంది. దీంతో మీరు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారు. ఇందుకోసం జీవిత బీమా కార్పొరేషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బీమా పథకం ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతూనే ఉంటుంది. ఈ పథకం వ్యవధి మే 1 నుండి జూన్ 31 వరకు ఉంటుంది. ప్రమాదం కారణంగా ఆకస్మికంగా మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు అందజేస్తారు.

సురక్ష బీమా యోజన..

ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కూడా ప్రమాద బీమా పథకమే. ప్రమాదవశాత్తు మరణం, వైకల్యానికి సంబంధించిన సందర్భంలో బీమా అందుతుంది. ఇతర సహజ మరణాలకు ఈ బీమా వర్తించదని గుర్తించుకోండి.. మరణం, పూర్తి వైకల్యానికి రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. లక్ష వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్‌లో రూ. 12 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరేటప్పుడే ఆటో డెబిట్ పెట్టేందుకు సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ అకౌంట్ నుంచి ఏటా డబ్బులు కట్ అవుతుంటాయి. ప్రతి ఏటా జూన్ 1- మే 31 వరకు బీమా కవరేజీ ఉంటుంది. కొనసాగించాలనుకుంటే మే నెలలో రెనివల్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న 18-70 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు.

ఈ పథకాల ప్రయోజనాల కోసం బ్యాంకులు, పోస్టాఫీసులో అందుబాటులో ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్ ఉంటుందని ఎస్‌బీఐ బ్యాంక్ పేర్కొంది. వినియోగదారులు ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సందర్శించకుండా వారి సౌలభ్యం మేరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ సదుపాయాన్ని తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. అయితే వినియోగదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేటప్పుడు తమ ఖాతా నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో ఎంటర్‌ చేయాలి. అలాగే ఎస్‌బీఐని వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి