Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Payments: పేటీఎం చరిత్ర ఇది.. అందుకే ఇన్ని సమస్యలు!

రిజర్వ్‌ బ్యాంక్‌ దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఒకే పాన్ నెంబర్ ను వంద కంటే ఎక్కువ ఖాతాలకు.. మరికొన్ని కేసుల్లో ఒకే పాన్ నెంబర్ ను వేలాది కస్టమర్ ఖాతాలకు లింక్ అయి ఉంది. ఆ ఖాతాలలోని లావాదేవీల విలువ కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. ఇది కనీస కేవైసీకి నిబంధనలను కూడా పాటించలేదు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి..

Paytm Payments: పేటీఎం చరిత్ర ఇది.. అందుకే ఇన్ని సమస్యలు!
Paytm
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2024 | 7:52 PM

ఆరేళ్ల కిందటే అంటే 2017లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుండి బ్యాంకింగ్ లైసెన్స్‌ని పొందింది. తరువాత బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే లైసెన్సింగ్ షరతులను ఉల్లంఘించినందుకు.. కేవైసీ నిబంధనలను పాటించనందుకు రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌ను ఎదుర్కొంది. 2018లో కొత్త ఖాతాల ఓపెనింగ్ ఆగిపోయింది. 2021లో రెండో క్రాక్ డౌన్ వచ్చింది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ తప్పుడు సమాచారాన్ని సమర్పించిందని ఆర్బీఐ కోటి రూపాయిల జరిమానా విధించింది. తరువాత ఆరు నెలలకే.. పేటీఎం, One97 కమ్యూనికేషన్‌ల సర్వర్‌లు రెండు వేర్వేరు సర్వర్ లుగా పనిచేయకపోవడంతో పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ పర్యవేక్షణ పరిమితిని విధించింది. ఇది వెంటనే అమల్లోకి రావడంతో దాని ప్రభావం కూడా వేగంగా పడింది. ఫిన్‌టెక్ కొత్త కస్టమర్‌లను బోర్డింగ్ ను ఆపివేయాల్సి వచ్చింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించడానికి ఎక్స్ టర్నల్ ఆడిట్ సంస్థను నియమించింది.

మళ్లీ, గత సంవత్సరం.. అంటే అక్టోబర్ 2023లో, కేవైసీ నిబంధనలను కొనసాగించకపోవడంతో ఆర్బీఐ 5.39 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. గత వారం ఆర్‌బిఐ విధించిన ఆంక్షలతో పేటీఎం కార్యకలాపాలపై పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది. మీడియా నివేదికల ప్రకారం ఇది మాత్రమే కాదు.. కేవైసీ, డిజిటల్ మోసాలు, మనీ లాండరింగ్ వంటివి ఉన్నాయి. కేవైసీ గురించి చెప్పాలంటే పెద్ద సంఖ్యలో కస్టమర్‌లు వారి కేవైసీ ఆమోదం పొందలేదు. లేదా వారి పాన్‌కార్డును ధృవీకరించలేదు.

ఇవే కాకుండా.. రిజర్వ్‌ బ్యాంక్‌ దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఒకే పాన్ నెంబర్ ను వంద కంటే ఎక్కువ ఖాతాలకు.. మరికొన్ని కేసుల్లో ఒకే పాన్ నెంబర్ ను వేలాది కస్టమర్ ఖాతాలకు లింక్ అయి ఉంది. ఆ ఖాతాలలోని లావాదేవీల విలువ కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. ఇది కనీస కేవైసీకి నిబంధనలను కూడా పాటించలేదు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇంకా, మ్యూల్ అకౌంట్స్ ను పెద్ద మొత్తంలో డోర్ మంట్ ఖాతాల నుంచి ఉపయోగించారు. అంటే అవి నగదు బదిలీకి మాత్రమే ఉపయోగించే ఖాతాలు. ఆ అకౌంట్స్ లో డబ్బులు ఉండవు. డిపాజిట్ చేసిన వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తారు. పేటీఎం నిర్వహిస్తున్న 35 కోట్ల ఖాతాల్లో 31 కోట్ల ఖాతాలు యాక్టివ్ గా లేవని CNBC TV 18 రిపోర్ట్ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి