Lakh Or Lac: లక్ష రూపాయలపై చెక్కుపై లక్షణమైన తప్పులు.. అసలు లక్ష అని చెక్‌పై ఎలా రాయాలి?

ప్రస్తుత రోజుల్లో ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత బాగా పెరిగింది. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో చెక్కుల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం రెండు లక్షల రూపాయాలకు మించి నగదు రూపంలో లావాదేవీలను చేయడం నిషేధించడంతో చాలా మంది చెక్కుల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. అయితే చెక్కుల్లో లక్ష రూపాయలను ఇంగ్లిష్‌లో రాసే సమయంలో చేసే తప్పు ఆ చెక్ రద్దు అవ్వడానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో చెక్కులో లక్ష రూపాయలు అనే పదాన్ని ఎలా రాయాలో? చూద్దాం.

Lakh Or Lac: లక్ష రూపాయలపై చెక్కుపై లక్షణమైన తప్పులు.. అసలు లక్ష అని చెక్‌పై ఎలా రాయాలి?
Lakh Or Lac
Follow us
Srinu

|

Updated on: Nov 30, 2024 | 4:06 PM

చెక్కులు రాసే సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా కొన్నిసార్లు లావాదేవీ రద్దుకు దారి తీస్తుంది. ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ పెరుగుతున్నా చాలా మంది ఇప్పటికీ చెక్కులను, ముఖ్యంగా పెద్ద లావాదేవీల కోసం ఉపయోగించేందుకు ఇష్టపడతారు. అయితే, చెక్కు రాసేటప్పుడు ముఖ్యంగా సంఖ్యల స్పెల్లింగ్ విషయానికి వస్తే, సరైన విధానాలను అనుసరించడం చాలా ముఖ్యం. లక్షల్లో మొత్తాలను రాసేటప్పుడు స్పెల్లింగ్ విషయంలో చాలా మంది ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. 

రూ. 10,00,000 (10 లక్షలు) రాయాల్సి వస్తే సంఖ్యాపరంగా స్పష్టంగా ఉండగా ఆ మొత్తాన్ని పదాలలో రాసేటప్పుడు సమస్య తరచుగా వస్తుంది. మీరు “Lakh” లేదా “Lac” అని ఉపయోగించాలా? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకారం సరైన పదం “Lakh” అని రాయాలని స్పష్టంగా పేర్కొన్నాయి. ఈ విషయంలో ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో కనుగొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు జారీ చేసే అన్ని అధికారిక చెక్కులపై ‘Lac’ని ఉపయోగించడం గమనార్హం

“Lakh”కు బదులుగా “Lac”ని ఉపయోగించినందుకు మాత్రమే చెక్ రద్దు చేయబడే అవకాశం లేదు. అయితే Lakh అనే పదాన్నే ఉపయోగించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ‘Lac’ అనే పదం తరచుగా సీలింగ్ లేదా వార్నిష్ చేయడానికి ఉపయోగించే పదార్ధం. కాబట్టి బ్యాంకింగ్ అవసరాలకు ‘Lakh’ అనేది సరైన మరియు ప్రాధాన్య పదం. అందువల్ల ఏవైనా సమస్యలను నివారించడానికి చెక్‌ను రాసేటప్పుడు ‘Lakh’ అని రాయడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి