Recharge Plan: రూ. 91 రీఛార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీ.. కానీ…

ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో బెస్ట్ ప్లాన్ తో యూజర్ల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ తో కేవలం రూ. 91 రీఛార్జ్ తో 60 రోజులు వ్యాలిడిటీ పొందొచ్చు..

Recharge Plan: రూ. 91 రీఛార్జ్‌తో 60 రోజుల వ్యాలిడిటీ.. కానీ...
Recharge Plan
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 30, 2024 | 2:58 PM

ఒకప్పుడు ఇన్‌కమింగ్ ఉచితంగా ఉండేది. టెలికం కంపెనీలు లైఫ్‌ టైమ్‌ ఉచితంగా ఇన్‌కమింగ్ కాల్స్‌ సౌలభ్యాన్ని అందించాయి. అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఇన్‌కమింగ్స్‌ కాల్స్‌ రావాలంటే కచ్చితంగా యాక్టివ్‌ ప్లాన్‌ ఉండే విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో రెండు సిమ్‌లు ఉన్న వారు, కేవలం ఇన్‌కమింగ్‌ కాల్స్ కోసం మాత్రమే ఫోన్‌ ఉపయోగిస్తున్న వారికి ఇబ్బందిగా మారింది.

కచ్చితంగా కనీసం నెలకు రూ. 150 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు అన్ని ప్రైవేటు టెలికం సంస్థలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 91 రీఛార్జ్‌తోనే ఏకంగా 60 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను అందించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 91తో రీఛార్జ్‌ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడీ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో ఎలాంటి టాక్‌టైమ్‌ రాదు. ఇందుకోసం ప్రత్యేకంగా రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అవుట్ గోయింగ్‌ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు పడుతుంది. ఒక్కో ఎస్‌ఎమ్‌ఎస్‌కు 25 పైసలు అవుతుంది. ఎక్కువ రోజులు సిమ్‌ యాక్టివ్‌లో ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం మరే ఇతర టెలికం సంస్థలో ఇలాంటి రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులో లేదని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌