Elenmusk – Twitter: ట్విట్టర్ టేకోవర్ డీల్‌లో ఊహించని ట్విస్ట్.. వరుస ట్వీట్లతో పిచ్చి లేపేశారు..!
Elenmusk: అందరూ చేసేదే ఆయనూ చేస్తే అతనెందుకు ఎలన్ మస్క్ అవుతాడు. ఎవ్వరూ ఊహించంది చేయడమే మస్క్ స్పెషాలిటీ.
Elenmusk: అందరూ చేసేదే ఆయనూ చేస్తే అతనెందుకు ఎలన్ మస్క్ అవుతాడు. ఎవ్వరూ ఊహించంది చేయడమే మస్క్ స్పెషాలిటీ. అందుకే, ట్విట్టర్ టేకోవర్ కోసం ఎవ్వరూ ఊహించని డీల్ ఆఫర్ చేశాడో, ఇప్పుడు అంతకంటే డబుల్ ట్రిపుల్ షాకిచ్చాడు.
ఎలన్ మస్క్, టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్ అధినేత, ఈయన చర్యలు ఊహాతీతం, ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ ఊహించంది చేయడమే ఎలన్ మస్క్ స్పెషాలిటీ. ఎలన్ మస్క్ ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవ్, ఇంటర్నేషనల్ బిజినెస్ దిగ్గజాల మైండ్‌లు సైతం బ్లాంక్ అయిపోతాయ్. అలా ఉంటాయ్ ఎలన్ మస్క్ ఎత్తులు జిత్తులు. ట్విట్టర్ విషయంలో ఎన్నో సంచలనాలకు తెరలేపిన ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చారు. రికార్డు రేటుతో ట్విట్టర్ టేకోవర్‌కు డీల్ సెట్ చేసుకున్న ఎలన్ మస్క్, ఇప్పుడు ఎవ్వరూ ఊహించని షాకిచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ టేకోవర్ డీల్‌పై సంచలన ట్వీట్ చేశారు మస్క్. స్పామ్ అండ్ ఫేక్ అకౌంట్స్ ఐదు శాతం కంటే తక్కువ ఉంటాయన్న లెక్కలను ట్విట్టర్ ఇంకా అందజేయలేదని, అందుకే డీల్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నట్లు ప్రకటించారు.
ఎలన్ మస్క్ ప్రకటనతో అమెరికన్ స్టాక్ మార్కెట్ ప్రీ-ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 20శాతానికి పైగా పడిపోయాయ్. ప్రముఖ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ టేకోవర్ కోసం గత నెలలో డీల్ కుదుర్చుకున్నారు ఎలన్ మస్క్. దాదాపు 44 మిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. ఇండియన్ కరెన్సీలో సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు ట్విట్టర్ చేజిక్కించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే, డీల్ కండీషన్స్‌లో భాగంగా స్పామ్ అండ్ ఫేక్ అకౌంట్స్ లెక్కలను ట్విట్టర్ అందించకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఎలన్ మస్క్. అత్యంత భారీ డీల్‌లో నిధుల సమీకరణ కోసం తంటాలు పడుతోన్న ఎలన్ మస్క్, ఇప్పుడు టెంపరరీగా ఒప్పందాన్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించడంతో అనుమానాలు చెలరేగుతున్నాయ్. వాల్‌స్ట్రీట్ వర్గాల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. అయితే, అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఇప్పటికీ ట్విట్టర్ టేకోవర్‌కి తాను కట్టుబడే ఉన్నానంటూ ప్రకటించారు ఎలన్ మస్క్.
Still committed to acquisition
— Elon Musk (@elonmusk) May 13, 2022