TVS I Qube: గత ఏడాది విడుదలైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణ.. టీవీఎస్ ఐక్యూబ్ మైలేజ్.. ఫీచర్స్ తెలుసుకోండి

2022 లో టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ స్కూటర్ అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ స్కూటర్స్ పై మక్కువ చూపుతున్నారు.

TVS I Qube: గత ఏడాది విడుదలైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణ.. టీవీఎస్ ఐక్యూబ్ మైలేజ్.. ఫీచర్స్ తెలుసుకోండి
TVS Iqube
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 7:45 PM

ప్రస్తుతం అన్ని కంపెనీలు తమ ఈవీ మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఎన్ని రకాల ఈవీ మోడల్స్ వచ్చినా కొన్ని మాత్రమే వినియోగదారుల ఆదరణను అందుకుంటాయి. అలాంటి వాటి కోవలోకి టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ ఈవీ స్కూటర్ వస్తుంది. 2022 లో టీవీఎస్ రిలీజ్ చేసిన ఐక్యూబ్ స్కూటర్ అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ స్కూటర్స్ పై మక్కువ చూపుతున్నారు. అయితే స్కూటర్ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలను ఇప్పడు తెలుసుకుందాం

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఈవీ స్పెసిఫికేషన్లు 

ఈ స్కూటర్ విద్యుత్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ముందు, వెనుక టైర్ 90/90-12 తో వస్తుంది. అలాగే బండి బరువు 118 కిలోలు. వెనుక డ్రమ్ బ్రేక్ తో వస్తుంది. అలాగే ముందుభాగంతో టెలీస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. ఓ సారి చార్జి చేస్తే 100 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అలాగే 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. 

సూపర్ కంఫర్ట్

ఐక్యూబ్ ఎస్ 770mm సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. సో దీన్ని సులభంగా బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే విశాలమైన ఫుట్‌బోర్డ్ మీ పాదాలను సౌకర్యవంతంగా ఉంటుంది. అ ఫ్లోర్‌ బోర్డ్ మీ రైడింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాక్‌ప్యాక్ కోసం తగినంత స్థలం మిగిలి ఉంటుంది. అలాగే ఎత్తైన హ్యాండిల్‌బార్ సౌకర్యవంతమైన సీటింగ్ ట్రయాంగిల్‌ను సృష్టిస్తుంది. అలాగే సీటు కుషనింగ్ ఆకట్టుకుంటుంది. చాలా ఈజీగా రెండు నుంచి మూడు గంటలకు ఎలాంటి అలసట లేకుండా ఈ బైక్ నడపవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ, మైలేజ్

ఈ ఈవీ స్కూటర్ ఎకో మోడ్‌లో 100 కిమీ మైలేజ్ ఇస్తుంది. అలాగే పవర్ మోడ్‌లో 75 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది. అలాగే ఈ స్కూటర్ గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే పవర్ మోడ్ ఎక్కువ బ్యాటరీ శక్తిని వినియోగిస్తుందని గమనించాలి. ఈ స్కూటర్ లో 3.4kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే దీన్ని చార్జ్ చేయడానికి దాదాపు 4.5 గంటలు పడుతుంది. అలాగే ఈ స్కూటర్ లో మొబైల్ చార్జింగ్ పోర్ట్ సదుపాయం కూడా ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?