AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ "చనిపోయిందని" ప్రకటించిన తరువాత, అమెరికా AI చాట్‌బాట్‌ల ద్వారా నిజ స్థితిని అంచనా వేయడం జరిగింది. ChatGPT, గ్రోక్, గూగుల్ జెమినీ, మెటా AI, కోపైలట్ వంటి AIలు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతోందని తేల్చాయి.

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?
Donald Trump
SN Pasha
|

Updated on: Aug 02, 2025 | 6:09 PM

Share

భారత ఆర్థిక వ్యవస్థ “చనిపోయింది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన, భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ట్రంప్‌ చెప్పనట్లు నిజంగానే భారత్‌ది డెడ్‌ ఎకానమీనా అని అమెరికా సృష్టించిన ఏఐ చాట్‌బాట్లను అడిగితే.. ట్రంప్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానాలు వచ్చాయి. “భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?” అనే ప్రశ్నకు ఐదు ప్రధాన అమెరికన్ AI ప్లాట్‌ఫామ్‌లు సమాధానం ఇచ్చాయి.

  • “భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్. ఇది ప్రతిష్టాత్మకమైనది” అని ChatGPT బదులిచ్చింది.
  • “లేదు, భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి” అని గ్రోక్ చెప్పింది.
  • “భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి ద్వారా వర్గీకరించబడింది.” అని గూగుల్‌ జెమినీ బదులిచ్చింది.
  • “భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి.” అని ఫేస్‌బుక్‌ మెటా ఏఐ వెల్లడించింది.
  • కోపైలట్ మరింత నిర్మొహమాటంగా బదులిస్తూ..”దగ్గరగా కూడా కాదు. నిజానికి, ఇది చాలా వ్యతిరేకం.” అని పేర్కొంది.

ట్రంప్ భారతదేశంపై తన విమర్శలను తీవ్రతరం చేస్తూ.. భారత్‌, రష్యా వాణిజ్య సంబంధాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయి అని విమర్శించారు. భారత వస్తువులపై సుంకాల పెంపు, భారతదేశం రష్యా ముడి చమురు, రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి పేర్కొనబడని జరిమానాను ప్రకటిస్తూ, ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేశారు. “భారతదేశం రష్యాతో ఏమి చేస్తుందో నాకు పట్టింపు లేదు. వారివి డెడ్‌ ఎకానమీలు. మేం భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేసాం, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికం.” అని పేర్కొన్నారు.

అయితే ట్రంప్ వాదనను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తోసిపుచ్చారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, కొన్ని సంవత్సరాలలో “మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ”గా అవతరిస్తుందని అని అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి