Hyundai Inster: ఆ టాటా కారుకు గట్టిపోటీ.. ఆకట్టుకుంటున్న హ్యూందాయ్ సూపర్ ఈవీ కారు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కాస్పర్ ఆధారంగా పని చేసే రాబోయే మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆసక్తికర వార్త పంచుకుంది. ఇన్‌స్టర్ పేరుతో రిలీజ్ చేసే ఈ కొత్త బ్యాటరీ ఆధారిత క్రాస్‌ఓవర్ ఇప్పుడు దక్షిణ కొరియా, యూరప్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌తో సహా పలు అంతర్జాతీయ మార్కెట్‌లలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను లాంచ్ చేసింది.

Hyundai Inster: ఆ టాటా కారుకు గట్టిపోటీ.. ఆకట్టుకుంటున్న హ్యూందాయ్ సూపర్ ఈవీ కారు
Hyundai Inster
Follow us

|

Updated on: Jun 28, 2024 | 4:30 PM

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కాస్పర్ ఆధారంగా పని చేసే రాబోయే మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆసక్తికర వార్త పంచుకుంది. ఇన్‌స్టర్ పేరుతో రిలీజ్ చేసే ఈ కొత్త బ్యాటరీ ఆధారిత క్రాస్‌ఓవర్ ఇప్పుడు దక్షిణ కొరియా, యూరప్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌తో సహా పలు అంతర్జాతీయ మార్కెట్‌లలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను లాంచ్ చేసింది. ఇన్‌స్టర్ ఈ వేసవిలో కొరియాలో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా ఇన్‌స్టర్ పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి చిన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేశారు. ఇన్‌స్టర్ లుక్స్ పరంగా చూస్తే ఎక్స్‌టర్‌తో సమానంగా ఉంటుంది. ఈ కారు 2,580 ఎంఎం వీల్‌బేస్‌ను అందిస్తుంది. ఇన్‌స్టర్ డైమెన్షనల్‌గా ఇండియా స్పెక్ ఎక్స్‌టర్‌కి దగ్గరగా ఉంటుంది. ఇది క్యాస్పర్ కంటే మెరుగైన ఇంటీరియర్ స్థలంతో వస్తుంది. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ ఇన్‌స్టర్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

హ్యూందాయ్ ఇన్‌స్టర్ అట్లాస్ వైట్, టామ్‌బాయ్ ఖాకీ, బిజారిమ్ ఖాకీ మాట్, అన్‌బ్లీచ్డ్ ఐవరీ, అలాగే సియన్నా ఆరెంజ్ మెటాలిక్, ఏరో సిల్వర్ మ్యాట్, డస్క్ బ్లూ మ్యాట్, బటర్‌క్రీమ్ ఎల్లో పెర్ల్, అబిస్ బ్లాక్ పెర్ల్ వంటి అనేక కొత్త రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు బయట భాగం బ్లాక్ హై-గ్లోస్ రీసైకిల్ పెయింట్‌తో రావడంతో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇన్‌స్టర్ క్యాబిన్ ఇంటీరియర్‌ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, చెరకు నుంచి సేకరించిన బయో-పాలీప్రొఫైలిన్ మెటీరియల్ వంటి స్థిరమైన పదార్థాలను ఉపయోగించి రూపొందించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్‌బిల్ట్ నావిగేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 64 కలర్ ఎల్‌ఈడీ యాంబియంట్ లైటింగ్, వన్-టచ్ సన్‌రూఫ్ ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి.

బ్లైండ్-స్పాట్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (BCA), రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్, సేఫ్టీ ఎగ్జిట్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి భద్రతా లక్షణాలతో కూడిన సమగ్ర స్థాయి 2 ఏడీఏఎస్ ప్యాకేజీని కూడా ఇన్‌స్టర్ సొంతం. ఇన్‌స్టర్ రెండు డెరివేటివ్‌లలో అంటే స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక ఛార్జ్‌పై కనీసం 300 కిమీ గరిష్ట పరిధిని అందిస్తుంది. రెండోది 49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 355 కిమీ పరిధిని అందిస్తుంది. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్‌ల కోసం టాప్ స్పీడ్‌లు 140 నుంచి 150 కిలోమీటర్లుగా ఉంటుంది. 120 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఈ కారు బ్యాటరీని దాదాపు 30 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..