AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతో తెలుసా?

Gold Price Today: బంగారం ధరల తగ్గుదల వెనుక అనేక దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉండవచ్చు. అతి పెద్ద కారణం అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న వాణిజ్య ఒప్పంద విధానం. అమెరికా ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. కొన్ని దేశాలతో చర్చలు జరుగుతున్నాయి..

Gold Rate Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతో తెలుసా?
ఇక వెండి విషయానికొస్తే నేనుందుకు తగ్గాలే అన్నట్లుగా కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్షా17 వేల రూపాయల వద్ద నమోదైంది. ఇక చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లో అయితే 1 లక్షా 27 వేల వరకు ఉంది.
Subhash Goud
|

Updated on: Jul 29, 2025 | 6:26 AM

Share

బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు వరుసగా ఐదో రోజు పడిపోయాయి. ఈరోజు రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు స్వల్పంగా తగ్గి లక్షా 7 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,740 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,590 వద్ద ఉంది. అయితే బంగారం ధర నాలుగైదు రోజులుగా తగ్గుతున్నప్పటికీ..లక్షా చేరువలోనే ఉంది. ఈ ధర చాలా ఎక్కువే.

ఇది కూడా చదవండి: Home Remedies: ఇంట్లో వస్తువులకు చెదలు పడుతున్నాయా? ఇలా చేస్తే అస్సలు ఉండవు.. అద్భుతమైన చిట్కాలు!

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.
  3. ఇవి కూడా చదవండి
  4. చెన్నైలో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.
  5. విజయవాడలో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి లక్షా 15,900 రూపాయల వద్ద ఉంది. ఇతర ప్రాంతాల్లో లక్షా 25 వేల వరకు ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం నుండి రక్షణకు బంగారం ఒక ఆదర్శవంతమైన ఎంపికగా ఉంది. పెట్టుబడిదారుల మనస్సులలో బంగారం ఒక ముఖ్యమైన పెట్టుబడిగా ఉద్భవించింది.

ఇది కూడా చదవండి: AIIMS: మద్యం తాగితే 7 ప్రమాదకర క్యాన్సర్లు.. ఎయిమ్స్‌ అధ్యయనంతో షాకింగ్‌ నిజాలు

బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలు:

ధరల తగ్గుదల వెనుక అనేక దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉండవచ్చు. అతి పెద్ద కారణం అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న వాణిజ్య ఒప్పంద విధానం. అమెరికా ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. కొన్ని దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. పెట్టుబడిదారులు కూడా వీటిపై నిశితంగా దృష్టి పెడుతున్నారు. దీనితో పాటు, పెట్టుబడిదారులు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలను కూడా గమనిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Honda Shine 100 DX: హీరో స్ప్లెండర్, HF డీలక్స్ ప్రోను తలదన్నే మరో చౌకైన బైక్‌..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి