Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవు పేడతో టైల్స్‌..! తయారీ వ్యాపారంతో ధనవంతులవుతున్న రైతులు, పశువుల కాపరులు..

పూర్వకాలంలో మట్టి ఇళ్లు ఉన్నపుడు ఇంటి నేలకు ఆవు పేడ పూసేవారు. అయితే, ఇప్పుడు ఆవు పేడ టైల్స్‌ రూపంలోకి వచ్చేసింది. మీ ఇళ్లలో అమర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆవు పేడ టైల్స్ వేసవి కాలంలో ఇంటికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో అమర్చిన తర్వాత,

ఆవు పేడతో టైల్స్‌..! తయారీ వ్యాపారంతో ధనవంతులవుతున్న రైతులు, పశువుల కాపరులు..
Cow Dung Tiles
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2023 | 10:37 AM

మీ ఇంట్లో మెరుస్తున్న టైల్స్‌ని ఆవు పేడతో తయారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి? ఇది కేవలం ఫాంటసీ కాదు, ఇప్పుడు ఇదే ట్రెండ్‌ ప్రారంభమైంది. ఇప్పుడు పశువుల కాపరుల్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారుతోంది. ఇప్పటికే ఆవు పేడ టైల్స్‌ మార్కెట్లోకి కూడా వచ్చాయి. దీని ఖర్చు అంత పెద్దగా ఏం లేదు. వీటి కారణంగా ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. ఆవు పేడతో చేసిన టైల్స్‌ వేయడం వల్ల మీ ఇంటి అందం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండడమే గొప్పదనం. ఈ టైల్స్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

పశువుల కాపరులు ఎలా ప్రయోజనం పొందుతున్నారు..?

మార్కెట్‌లో ఆవు పేడ టైల్స్‌కు డిమాండ్ పెరగడంతో దీనిని తయారు చేసే కంపెనీలు కూడా పెరిగాయి. ఇందుకు పెద్ద సంఖ్యలో రైతులు పనిచేయాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలు చిన్న రైతుల నుండి ఆవు పేడను మంచి ధరకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఆవు పేడను ప్రాసెస్ చేసిన తర్వాత, ఆవు పేడ టైల్స్‌ను యంత్రాల ద్వారా తయారు చేస్తారు. ఈ టైల్స్‌ పూర్తిగా సేంద్రీయమైనవి. ఈ కారణంగా ఈ టైల్స్ మార్కెట్‌లో మంచి ధరలకు అమ్ముడవుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో దాని భిన్నమైన రూపం కనిపిస్తుంది. ఇక్కడ మహిళలు పలు పథకాల కింద ఆవు పేడ టైల్స్‌ను తయారు చేస్తున్నారు. అయితే, ఇక్కడ మహిళలు ఆవు పేడ టైల్స్‌ని చేతులతోనే తయారు చేస్తారు.

ఇంటికి ఏది సరైనది..

ఇవి కూడా చదవండి

వేదాలలో ఆవు పేడ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి పూజా స్థలంలో తరచుగా ఆవు పేడను పూస్తారు. పూర్వకాలంలో మట్టి ఇళ్లు ఉన్నపుడు ఇంటి నేలకు ఆవు పేడ పూసేవారు. అయితే, ఇప్పుడు ఆవు పేడ టైల్స్‌ రూపంలోకి వచ్చేసింది. మీ ఇళ్లలో అమర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆవు పేడ టైల్స్ వేసవి కాలంలో ఇంటికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో అమర్చిన తర్వాత, ఇది ఇంటి ఉష్ణోగ్రతను 5 నుండి 8 శాతం తగ్గిస్తుంది. మీరు ఆవు పేడ టైల్స్ కొనాలనుకుంటే, మీరు వాటిని ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చాలా మంది వ్యాపారవేత్తలు ఆవు పేడ పలకలను విక్రయిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..