Watch: పిల్లులు మాట్లాడుతాయా..? ఇదిగో ఇక్కడ తెగ చర్చించుకుంటున్నాయి..!! షాక్‌లో నెటిజన్లు.. నమ్మలేని వైరల్ వీడియో

ఇందులో రెండు పిల్లులు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం చూస్తాం. అయితే అవి మాట్లాడుకుంటున్నాయో.. గొడవ పడుతున్నాయో తెలియదు. కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కళ్ళు మూసుకుని ఈ వీడియో సౌండ్ మాత్రమే వింటుంటే.. రెండు పిల్లులు మాట్లాడుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది,

Watch: పిల్లులు మాట్లాడుతాయా..? ఇదిగో ఇక్కడ తెగ చర్చించుకుంటున్నాయి..!! షాక్‌లో నెటిజన్లు.. నమ్మలేని వైరల్ వీడియో
Cat Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2023 | 10:03 AM

సోషల్ మీడియా ప్రపంచం ఎన్నో అద్భుతాలతో నిండిపోయింది. ఇక్కడ మనం ఊహించలేనివన్నీ చూస్తాం. మనం ఇంటర్నెట్‌లో చూసే వీడియోలలో ఒక్కోసారి నవ్వించేవి, ఒక్కోసారి ఆలోచింపజేసేవి, ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించేవి, ఒక్కోసారి దిగ్భ్రాంతి కలిగించేవి, ఒక్కోసారి బాధ కలిగించేవి ఎన్నో ఉంటాయి. జంతువుల వీడియోలకు ఇంటర్నెట్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ ఆసక్తికరమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కోతి, పాము, కుక్క, పిల్లి, ఏనుగు వంటి జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయబడతాయి. వ్యూస్‌ కూడా అదేరేంజ్‌లో ఉంటాయి. అలాగే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల వీడియోలు నెటిజన్లలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. చాలా మందికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. అందుకే చాలా మంది ఈ జంతువులను, వాటి వీడియోలను చాలా ఆసక్తిగా చూస్తారు.

ఇంటర్నెట్ అందమైన జంతువుల వీడియోల నిధి అని చెప్పవచ్చు. ఈ వీడియోలు కొన్నిసార్లు మనకు తెలియని అనేక విషయాలను నేర్పుతాయి. ఇటీవల షేరైన ఓ క్యూట్ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోని షేర్‌ చేశారు. వీడియోలో రెండు పిల్లుల సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో రెండు పిల్లులు కనిపిస్తున్నాయి. ఇందులో రెండు పిల్లులు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం చూస్తాం. అయితే అవి మాట్లాడుకుంటున్నాయో.. గొడవ పడుతున్నాయో తెలియదు. కానీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కళ్ళు మూసుకుని ఈ వీడియో సౌండ్ మాత్రమే వింటుంటే.. రెండు పిల్లులు మాట్లాడుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది, “నిన్న సాయంత్రం మా ఇంటి బయట ఎవరో చిన్న పిల్లలు గొడవ పడుతున్నట్లు నేను విన్నాను. కానీ బయటకు వచ్చి చూసేసరికి అవి రెండు పిల్లులు. ఇది నిజంగా అద్భుతం!” అని రాసివుంది.

ఈ అద్భుతమైన వీడియోను వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 47 వేలకు పైగా వీక్షణలు, లెక్కలేనన్ని లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘మనకు తెలియని ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో ఈ వీడియో చూపిస్తుంది’ అని ఒక వినియోగదారు రాశారు. ‘ఈ పిల్లులు మాట్లాడుకోవడం చూడటానికి చాలా ముద్దుగా ఉంది’ అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు. మరో వినియోగదారు, ‘అవును… ఇది పిల్లుల గొంతులానే ఉందంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..