Viral: ముఖానికి ముసుగులు, చేతిలో పిస్టల్.. దొంగతనానికి వచ్చి.. చివరికి ఏం దోచుకెళ్లారో తెలిస్తే.!
ఓ ఇద్దరు దొంగలు.. ముఖానికి ముసుగులు, చేతిలో పిస్టల్‌తో పక్కా ప్లాన్ వేసుకుని మరీ ఒక షాప్‌లో దొంగతనానికి వచ్చారు. అక్కడున్న వారిని..

ఓ ఇద్దరు దొంగలు.. ముఖానికి ముసుగులు, చేతిలో పిస్టల్‌తో పక్కా ప్లాన్ వేసుకుని మరీ ఒక షాప్‌లో దొంగతనానికి వచ్చారు. అక్కడున్న వారిని గట్టిగా బెదిరించి.. కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని ఉడాయించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఏం దొంగలించారో తెలిస్తే.? మీరు షాక్ అవ్వడం ఖాయం. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ దొంగలు ఎత్తుకెళ్ళింది నాలుగు జతల షూస్.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రేవారీలో ఓ వింత దొంగతనం జరిగింది. ఇద్దరు దొంగలు ఏదో బ్యాంక్ లేదా బంగారం షాప్‌లో దొంగతనానికి వచ్చినట్టుగా పెద్ద రాబరీ గ్యాంగ్‌లా స్టైల్‌గా వచ్చి.. చివరికి నాలుగు జతల బూట్లు దొంగలించారు. ఆ ఇద్దరికీ కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. ఈ ఘటన జరిగి రెండేళ్లు కాగా, ఇటీవల కోర్టు ఆ నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 41 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.
